పెళ్లంటే జీవితంలో ఒకసారే వస్తుంది.అందుకే పెళ్లిలో అందంగా మెరిసిపోవాలని పెళ్లి కూతురు తెగ ఆరటపడుతుంది.
ఈ నేపథ్యంలోనే పెళ్లికి కొద్ది రోజుల ముందు నుంచీ చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన వైటనింగ్ క్రీములు, లోషన్లు, ఫేస్ ప్యాకులు తెచ్చుకుని వాడుతుంటారు.
అయితే త్వరలో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఎలాంటి ఖర్చు లేకుండా ఇప్పుడు చెప్పే సింపుల్ ఫేస్ ప్యాక్స్‌ను వాడితే గనుక పెళ్లిలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారొచ్చు.మరి ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఆలస్యం చేయకుండా చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల టమాటా పేస్ట్, ఒక స్పూన్ ముల్తానీ మట్టి, ఒక స్పూన్ పెరుగు మరియు ఒక స్పూన్ కాఫీ ఫౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌లా వేసుకోని.ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ ప్యాక్ వల్ల స్కిన్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.మరియు మొటిమలు, మచ్చలు ఉన్నా తగ్గిపోతాయి.
అలాగే ఒక బౌల్లో రెండు స్పూన్ల చియా సిడ్స్, ఒక కప్పు పాలు వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి.ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుని.
అందులో పావు స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, అర స్పూన్ పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమానికి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఈ ప్యాక్ వల్ల మీ ముఖం స్మూత్‌గా, గ్లోగా మెరుస్తుంది.మరియు చర్మంపై అదనపు జిడ్డు సైతం పోతుంది.

ఇక ఈ ఫేస్ ప్యాక్స్‌తో పాటుగా త్వరలో పెళ్లి పీటలెక్కబోయే పెళ్లి కూతుర్లు.ఉదయం లేవగానే లెమెన్ వాటర్‌లో హనీ యాడ్ చేసి తీసుకోండి.తద్వారా స్కిన్ యవ్వనంగా కనిపిస్తుంది.ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.డైట్లో తాజా పండ్లు, నట్స్, ఆకుకూరలు ఉండేలా చూసుకోండి.వాటర్ ఎక్కువగా తీసుకోండి.
మరియు నిద్రను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకండి.ఇవన్నీ పాటిస్తే మీ పెళ్లిలో మీరు అద్భుతంగా మెరిసిపోతారు.