మాములుగా ఒక చెట్టుకు ఒకే రకం పండు కాస్తాయి.కానీ మీరు ఎప్పుడైనా చూసారా ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు కాయడం.
ఏంటి నమ్మడం లేదా ఒకే చెట్టుకు అన్ని రకాల పండ్లు ఎలా కాస్తాయి అని ఆలోచిస్తున్నారా నిజమేనండి బాబు.ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు కాసాయి.
ఒక వ్యక్తి అంటుకట్టడంలో వినూత్న పద్ధతులు పాటిస్తూ ఇలా ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు కాసేలాగా చేస్తున్నాడు.
ఇది అమెరికాలో జరిగింది.
ఒక అమెరికా రైతు ఇలా అంటుకట్టడంలో వినూత్న పద్ధతులు పాటించి ఒకే చెట్టుకు అన్ని రకాల పండ్లను కాసేలా చేసాడు.ఆయన సైరక్యూస్ యూనివర్సిటీలో విజువల్ ఆర్ట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.
ఆయన ఒక చెట్టుకు అంటుకట్టి ఇలా అన్ని రకాల పండ్లు కాసేలా చేసాడు.రేగు పండు, నేరేడు, పీచ్, చెర్రీ, మామిడి పండు, ద్రాక్ష వంటి వివిధ రకాల పండ్లను కాసేలా చేసాడు.

ఇలా ఒకే చెట్టుకు 40 రకాల పండ్లు కాయడం చుసిన ఆశ్చర్య పోతున్నారు.ఆయన అంటుకట్టు విధానం ద్వారా ఒక చెట్టును సృష్టించి ఆ చెట్టుకు ఇలా పండ్లు కాసేలా చేస్తున్నాడు.అయితే ఇదంతా జరగడానికి చాలా సమయం పట్టింది.ఈ చెట్టు మొగ్గ వేయడానికే దాదాపు తొమ్మిది సంవత్సరాల సమయం పట్టిందని ప్రొఫెసర్ వివరించాడు.

ఇలా వేరు వేరు చెట్లను అంటుకట్టే విధానం ఉపయోగించి ప్రధాన చెట్టుకు అంటూ కట్టారు.ఈ చెట్టు ప్రాణం పోసుకునేందుకు గ్రాఫ్టింగ్ విధానాన్ని పాటించారు.ఆయనకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.ఆయన ఒకసారి ఒక తోటను చూశాడట.అందులో 200 రకాల పండ్ల తోటలు ఉండగా వాటిని వృధాగా వదిలేస్తున్నారని తెలుసుకుని ఆ తోటను కౌలుకి తీసుకుని ఆయన ఇలా చేశారట.ఈ నిర్ణయం తెలుసుకుని నెటిజెన్స్ ఆయనను ప్రశంసిస్తున్నారు.