డాక్టర్ నిర్లక్ష్యం శిశువు మృతి?

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం సమీపంలో గల శివసాయి ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది.శిశువుకి మృతికి హాస్పిటల్ వైద్యురాలి నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఆందోళన చేపట్టారు.

 The Doctor's Neglect Baby Died?-TeluguStop.com

వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన చిర్ర నాగమణిని పురిటి నొప్పులతో డెలివరీ నిమిత్తం గురువారం ఉదయం 10 గంటలకు శివసాయి హాస్పిటల్ కి తీసుకొచ్చారు.ఆమెను పరీక్షించిన డాక్టర్ నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పి,సాయంత్రం వరకు పేషంట్ ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

శిశువు మృతికి కారణమైన డాక్టర్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube