జిల్లాలో 45 మంది హెడ్ కానిస్టేబుల్స్ బదిలీ, ఆప్షన్ ప్రకారం కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్స్,గర్వంగా విధులు నిర్వర్తించి,గౌరవంగా ఉండాలి: ఎస్పీ రాజేంద్రప్రసాద్

సూర్యాపేట జిల్లా:ఇటీవల జిల్లాలో కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందిన విషయం తెలిసిందే.ప్రమోషన్ పొందిన సిబ్బందికి ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు ఎస్పీ రాజేంద్రప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం జిల్లాలో బదిలీల ప్రక్రియ చేపట్టారు.

 Transfer Of 45 Head Constables In The District, Postings Through Counseling As P-TeluguStop.com

సిబ్బంది ఆరోగ్యం,కుటుంబ అవసరాలు,వారు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి కొరుకున్న పోలీస్ స్టేషన్ల కు బదిలీ చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగికి బదిలీ సాదారణమైనది,ఎక్కడ విధులు నిర్వర్తించినా గర్వంగా పని చేసి,గౌరవంగా ఉండాలని సూచించారు.

అందరూ టీమ్ వర్క్ తో బాగా పని చేసి,పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని కోరారు.కమిటీ సూచనల ద్వారానే బదిలీలు చేయడం జరిగినదని తెలిపారు.

తదుపరి జిల్లా అదనపు ఎస్పీ రితి రాజ్ మాట్లాడుతూ సిబ్బంది అందరి అవసరాలు,సామర్థ్యం దృష్టిలో ఉంచుకుని కోరుకున్న పీఎస్ కు బదిలీ చేసినారని,ఎస్పీ నమ్మకాన్ని కోల్పోకుండా బాగా పని చేయాలని ఆకాంక్షించారు.అందరి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సిబ్బందికి బదిలీ చేసిన ఎస్పీకి పోలీసు సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ మోహన్ కుమార్,ఏవో సురేష్ బాబు,ఎస్బి సిఐ శ్రీనివాస్,అధ్యక్షులు రామచందర్ గౌడ్,సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube