టీడీపి నాయకుడు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు ప్రస్తుతం నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో సీమ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఇటీవల ప్రభుత్వం పై విమర్శలు చేయడం జరిగింది.
కాగా తాజాగా నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి అక్కడ రోగులకు అందుతున్న సేవల విషయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఊహించని విధంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఆసుపత్రికి రావడంతో వైద్యులు ఒక్కసారిగా షాక్ అయినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే ఆసుపత్రి పనితీరుపై బాలకృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
రోగులకు అందుతున్న వైద్యం తో పాటు వైద్య సౌకర్యాలు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న.
ఎమ్మెల్యే బాలకృష్ణ తర్వాత పేషంట్ల వద్దకు వెళ్ళి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది రోగులు.
బాలయ్య వద్ద వైద్యులు సకాలంలో అందుబాటులో ఉండటం లేదని… వారి ప్రైవేట్ క్లినిక్ లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలియజేయడంతో.బాలయ్య బాబు వైద్యులపై మండిపడినట్లు సమాచారం.
ఇదే క్రమంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నాలుగు రోజుల క్రితం బిడ్డ చనిపోయిందని తెలపడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బాలయ్యబాబు.అంత మాత్రమే కాక ఈ ఘటనపై చర్యలు తీసుకుంటానని బాధితులకు బాలయ్య బాబు.
హామీ ఇవ్వడం జరిగింది అట.ఇదిలా ఉంటే గతంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి బాలయ్య తన సొంత ఖర్చులతో.వెంటిలేటర్లు అందజేయడం జరిగింది.