మీరు 10 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?  

People Born On The 10 Th Of Everymonth -

10 వ తారీఖున జన్మించిన వారి గుణాలు,ప్రవర్తన,బలాలు,బలహీనతలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.10 వ సంఖ్యకు సూర్యడు అధిపతి.వీరి మీద సూర్య గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.వీరి విజయాల శాతం ఎక్కువగా ఉన్నా సరే ఒక్కసారిగా కాకుండా నిదానంగా ముందుకు సాగుతారు.వీరు జీవితంలో కష్టపడి పనిచేసి విజయాలను అందుకోవటం వలన తక్కువ సమయంలోనే టార్గెట్ ని రీచ్ అవుతారు.వీరు ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థితిలోకి వెళతారు.

వీరు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే వీరికి విజయాలు తేలికగా రావు.చాలా కస్టపడి సంపాదించుకోవాలి.వీరికి జీవితంలో ఏది సులువుగా రాదు.కష్టపడి సంపాదించుకోవాలి.వీరిని పది మంది వ్యక్తులు నమ్ముతారు.వీరు ఏ రంగంలో ఉన్నా సరే వీరికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.

మీరు 10 వ తారీఖున జన్మించారా….అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా-General-Telugu-Telugu Tollywood Photo Image

వీరికి సూర్య గ్రహ ప్రభావం ఉండటం వలన నాయకత్వ లక్షణాలు,ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటాయి.ఓటమి వస్తే దిగులు పడకుండా విజయం దిశగా అడుగులు వేయటానికి సిద్ధం అవుతారు.కానీ ఓటమికి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు.ఎప్పుడు వీరి అడుగులు విజయం దిశగానే ఉంటాయి .

వీరి విజయాలను చూసి అసూయ పడే వారి సంఖ్య అలాగే శత్రువులు కూడా ఎక్కవగానే ఉంటారు.వీరి శత్రువులు వీరి మీద విజయాన్ని సాధించాలని అనుకున్న సాధించలేరు.

ఒకవేళ సాధించిన అది తాత్కాలికం మాత్రమే.విజయాల గురించి పది మందికి చెప్పటం వలన వీరికి నష్టమే కలుగుతుంది.

అందువల్ల వీరు విజయాల గురించి చాలా తక్కువగా మాట్లాడితే మంచిది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

GENERAL-TELUGU