వయసు పైబడే కొద్ది చర్మం సాగిపోతూ ఉంటుంది.దాంతో ముడతలు ఏర్పడతాయి.
కానీ, ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది చిన్న వయసులోనే ముడతల సమస్యను ఫేస్ చేస్తున్నారు.ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.
ఆహారపు అలవాట్లు, పెరిగిన కాలుష్యం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం, జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను చర్మానికి వాడటం వంటి రకరకాల కారణాల వల్ల ముడతలు ఏర్పడుతుంటాయి.
ఏదేమైనా చిన్న వయసులోనే ముడతలు వస్తే.
చూసేందుకు చాలా అసహ్యంగా ఉంటుంది.పైగా వయసు ఎక్కువ వారిలా కనిపిస్తారు.
అందుకే ముడతలను నివారించుకోవడం కోసం ఏవేవో చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను గనుక పాటిస్తే సాగిన చర్మాన్ని టైట్‌గా మార్చుకోవచ్చు.
మరియు ముడతలను వదిలించుకోవచ్చు.మరి ఆ చిట్కాలు ఏంటో లేట్ చేయకుండా తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఈస్ట్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల హాట్ మిల్క్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి.

ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని మళ్లీ అన్ని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై నార్మల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని.ఐదైనా మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒక సారి చేస్తే గనుక ముడతలు క్రమంగా తగ్గిపోయి ముఖం అందంగా, ఎట్రాక్టివ్‌గా మారుతుంది.
అలాగే ఈస్ట్ పౌడర్‌ను యూజ్ చేసి మరో విధంగా కూడా ముడతలను తగ్గించుకోవచ్చు.
అందుకోసం, ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఈస్ట్ పౌడర్, నాలుగైదు టేబుల్ స్పూన్ల గ్రేప్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముకానికి పట్టించి డ్రై అయిన తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది