హెలికాప్టర్ లో 'పారాషూట్స్' ఉంటాయి...కానీ ఏరోప్లేన్స్ లో ఉండవు.! వెనకున్న 8 కారణాలివే.!     2018-10-19   11:25:51  IST  Sai Mallula

రైళ్లు, వాహ‌నాల్లోనే కాదు, విమానాల్లో ప్ర‌యాణించే వారు కూడా ఎవ‌రైనా సేఫ్ గానే గ‌మ్య స్థానం చేరాల‌ని అనుకుంటారు. కానీ ఒక్కోసారి అనుకోకుండా జ‌రిగే ప్ర‌మాదాల కార‌ణంగా విమానాలు క్రాష్ అవుతుంటాయి. దీంతో అలాంటి క్రాష్ ల్యాండింగ్‌ల‌లో ప్ర‌యాణికులు బ‌తికే సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. అయితే ఇది స‌రే.. విమానాల్లో పారాచూట్‌ల‌ను అందుబాటులో ఉంచితే అవి అలా క్రాష్ అయ్యే స‌మ‌యంలో ప్ర‌యాణికుల‌కు ప‌నికొస్తాయి క‌దా. ఎంచ‌క్కా వాటిని ప్ర‌యాణికులు వేసుకుని కింద‌కు జంప్ చేస్తే ప్రాణాల‌ను కాపాడుకోవచ్చు క‌దా. మ‌ర‌లాంట‌ప్పుడు తెలిసి కూడా పారాచూట్‌ల‌ను విమానాల్లో ఎందుకు ఉంచ‌డం లేదు ? అని చాలా మందికి డౌట్ వ‌చ్చే ఉంటుంది. మ‌రి ఆ డౌట్‌ను ఇప్పుడు క్లియ‌ర్ చేసుకుందామా..!

విమానాల్లో పారాచూట్ ల‌ను పెట్ట‌క‌పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే…
1. విమానాల్లో పారాచూట్‌ల‌ను ఉంచితే అవి 12వేల అడుగుల క‌న్నా త‌క్కువ ఎత్తులో త‌క్కువ స్పీడ్‌లో ప్ర‌యాణిస్తున్న‌ప్పుడే వాటిలోంచి పారాచూట్ ల ద్వారా కింద‌కు దూకే అవ‌కాశం ఉంటుంది. కానీ విమానాలు అంత క‌న్నా ఎక్కువ ఎత్తులో ప్ర‌యాణిస్తాయి. ఇక వాటి వేగం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. క‌నుక పారాచూట్‌ల‌ను త‌గిలించుకుని అంత ఎత్తులో అంత వేగంలో విమానం నుంచి దూక‌డం అసాధ్యం. అలా దూకేందుకు డోర్ల‌ను తీస్తే విమానంలో ఉన్న ప్ర‌యాణికులందరూ గాలి ప్ర‌భావం వ‌ల్ల కింద‌కు ప‌డిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతోపాటు ఫ్లైట్‌పై భారం అద‌నంగా ప‌డి అది ఇంకా త్వ‌రగా క్రాష్ ల్యాండింగ్ అవుతుంది. క‌నుక‌నే విమానాల్లో పారాచూట్‌ల‌ను పెట్ట‌రు.

Parachutes In Helicopters Why Don't Have Airlines-

Parachutes In Helicopters Why Don't Have Airlines

2. విమానాలు క్రాష్ ల్యాండింగ్ అయ్యేట‌ప్పుడు ఆకాశం నుంచి కింద‌కు చాలా వేగంతో దూసుకువ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలో విమానంలో ఉన్న ప్ర‌యాణికులంద‌రికీ పారాచూట్‌ల‌ను ఇవ్వ‌డం, వాటిని త‌గిలించుకోమ‌ని చెప్ప‌డం, వాటిని ఎలా వాడాలో చెప్ప‌డం క‌ష్టంగా ఉంటుంది. దీనికి తోడు పిల్ల‌లు, వృద్ధులు పారాచూట్‌ల‌ను అలాంటి స‌మయాల్లో వాడ‌లేరు. క‌నుక‌నే వాటిని విమానాల్లో పెట్ట‌డం లేదు.

Parachutes In Helicopters Why Don't Have Airlines-

3. ఒక్కో పారాచూట్ 8 నుంచి 10 కేజీల బ‌రువుంటుంది. అది చాలా ఖ‌రీదు ఉంటుంది. ఈ క్ర‌మంలో అంత ఖ‌రీదైన పారాచూట్ ల‌ను కొని ఏ ఎయిర్ లైన్ సంస్థ కూడా త‌న విమానాల్లో పెట్ట‌దు. దీనికితోడు వాటి బ‌రువు వ‌ల్ల విమానంలో తక్కువ మంది ప్యాసింజ‌ర్ల‌ను మాత్ర‌మే తీసుకుని వెళ్లేందుకు చాన్స్ ఉంటుంది. ఇది కంపెనీల‌కు న‌ష్టం క‌లిగించే వ్య‌వ‌హారం. క‌నుక‌నే ఏ ఎయిర్‌లైన్ కంపెనీ అయినా విమానాల్లో పారాచూట్‌ల‌ను పెట్ట‌దు.

Parachutes In Helicopters Why Don't Have Airlines-

4. ఒక వేళ అంతటి గ‌రిష్ట‌మైన ఎత్తులో ఉన్న‌ప్పుడు విమానం నుంచి పారాచూట్ వేసుకుని దూకుదామ‌నుకున్నా అందుకు పారాచూట్‌తోపాటు ఆక్సిజ‌న్ ట్యాంక్‌, మాస్క్‌, ఫ్లైట్ సూట్‌, హెల్మెట్‌, ఆల్టీమీట‌ర్ వంటి ప‌రిక‌రాల‌ను కూడా ధ‌రించాలి. ఇదంతా త‌ల‌నొప్పి వ్య‌వ‌హారం. క‌నుక‌నే విమానాల్లో పారాచూట్‌ల‌ను పెట్ట‌రు.

Parachutes In Helicopters Why Don't Have Airlines-

5. విమానాల్లో పారాచూట్ల‌ను పెట్టినా క్రాష్ ల్యాండింగ్ అయ్యే స‌మ‌యాల్లో వాటి గురించి ఫ్లైట్ సిబ్బంది ప్రయాణికుల‌కు చెప్పేంత టైం ఉండ‌దు. ఇది కూడా విమానాల్లో పారాచూట్ల‌ను పెట్ట‌క‌పోవ‌డానికి గల ఉన్న మ‌రో కార‌ణం.

Parachutes In Helicopters Why Don't Have Airlines-

6. పారాచూట్ల‌ను, పైన తెలిపినట్టుగా ప‌రిక‌రాల‌ను పెడితే అలాంటి విమానాల్లో టిక్కెట్ల రేట్లను మ‌రింతగా పెంచాల్సి ఉంటుంది. ఇది చాలా మంది ప్ర‌యాణికుల‌కు న‌చ్చ‌ని అంశం. క‌నుక పారాచూట్ల‌ను పెట్ట‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని ఎయిర్‌లైన్ సంస్థ‌లు భావిస్తాయి.

Parachutes In Helicopters Why Don't Have Airlines-

7. ఇక చివ‌రిగా మ‌రో ముఖ్య కార‌ణం ఏమిటంటే… పారాచూట్ ఇచ్చినా క్రాష్ ల్యాండ్‌లో దూకినా ప్ర‌యాణికుడికి అంత‌కు ముందు ఆ అనుభవం ఉంటే ఏమీ కాదు. లేదంటే వారు పారాచూట్ ధ‌రించి కింద‌కు దూకినా సేఫ్‌గా భూమిపై ప‌డ‌క‌పోవ‌చ్చు. వారికి అనుభ‌వం ఉండ‌ని కార‌ణంగా గాయాల బారిన ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది.

Parachutes In Helicopters Why Don't Have Airlines-

8. మ‌రో విష‌యం ఏమిటంటే… ఈత రాని వారు స‌ముద్రంలో పడితే ఇక వారి ప‌ని అంతే. అలాగే అడ‌వుల్లో, ఇత‌ర ప్ర‌మాద‌క‌ర‌మైన ప్రాంతాల్లో పారాచూట్‌తో దిగితే అక్క‌డ మ‌నుగ‌డ క‌ష్ట‌సాధ్య‌మై వారి ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. క‌నుక‌నే.. ఇన్ని కార‌ణాలు ఉంటాయి కాబ‌ట్టే.. సాధార‌ణంగా ఏ ఎయిర్ లైన్ కంపెనీ అయినా త‌మ త‌మ విమానాల్లో పారాచూట్ల‌ను ఉంచ‌డం లేదు.