సూర్యాపేట జిల్లా ఎస్పీకి బహిరంగ లేఖ

సూర్యాపేట జిల్లా:శ్రీయుత గౌరవనీయులైన శ్రీ రాజేంద్రప్రసాద్ ఎస్పీ సూర్యాపేట జిల్లా గారికి నమస్కరించి వ్రాయునది.బానిస బ్రతుకులపై, ప్రజాస్వామిక పాలనకై తెగిపడిన వేలాదిమంది తలల సాక్షిగా జరిగిన తెలంగాణా విలీనం రోజు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం ర్యాలీలో మీరు మాట్లాడిన అంశంపై శుక్రవారం మధ్యాహ్నం నుండి సామాజిక మాధ్యమాల్లో,మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ బహిరంగ లేఖ వ్రాయాల్సిన సందర్భాన్ని మీరు కల్పించారు.

 An Open Letter To Suryapet District Sp-TeluguStop.com

ఇది సూర్యాపేట గడ్డ,పుట్టుక స్వభావం ప్రతి అపసవ్య సందర్భంలో స్పందించకుండా ఉండలేం.ఒక ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమ కార్యకర్తగా మిమ్మల్ని కలిసే సందర్భం నాకు రాలేదు.

ఇవ్వాలో, రేపో మిమ్మల్ని కలుద్దామనుకుంటున్న సమయంలో అనివార్యంగా ఈ లేఖ వ్రాస్తున్నాం.ఒక పోలిస్ ఉన్నతాధికారిగా,జిల్లా బాస్ గా మీనుండి ఒక బహిరంగ పిలిపుకోసం ఎదురుచూశాం.

నిన్న ఒక బానిస స్వభావ నినాదం ఇప్పించారో దాని స్థానంలో అంతకంటే గట్టిగా సూర్యాపేటలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి దందాపై విరుచుకుపడతారేమో, ఇప్పుడిప్పుడే ఆ మత్తుకు బానిసలవుతున్న బిడ్డల్ని కాపాడడానికి కేకలు వేయించి గంజాయి దందాకు బీటలు వారిస్థారేమోనని ఆశ పడ్డాం.కానీ,మీరు స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి వినియోగించుకున్నారు.

(వ్యక్తుల,మీద,ప్రేమ,గౌరవాలు కల్గివుండడం మీ స్వేచ్ఛ,ఎవరం కాదనలేం) సూర్యాపేటలో జరిగిన ర్యాలీలో శ్రీశ్రీ ఇచ్చిన ఆకలికేకల పిలుపును మీరు వక్రీకరించారు, అసందర్భంగా ఉపయోగించారు.ఆ కేకలు ఉరుములై, పిడుగులు ఆ శబ్దాల ప్రతిధ్వనికి తట్టుకోలేకనే నైజాం నవాబు శిరస్సు వంచి,కేంద్రం ముందు మోకరిల్లి, తెలంగాణ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు.

ఆకలి కేకలకు,ఆత్మగౌరవ నినాదాలకు, పోరాటాలకు ఒక ఫలితం నాటి తెలంగాణ విలీనం,నేటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.మీరు ఆ పోరాట వారసత్వం ఉన్న విద్యార్థులలో బానిస పొగిడింపులు చేయించే ప్రయత్నం చేశారు.

మరోవైపు అదేదో స్టేజీలు కదలాలి బీటలు వారాలి అని పిలుపునిచ్చారు.అవును ‘మరక మంచిదే’ అన్నట్లు ఉంది మీ పిలుపు.

కచ్చితంగా మా సూర్యాపేట బిడ్డలు మీ పిలుపుని అందుకుంటారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన అనుచరగణం కొనసాగిస్తున్న నయాగడీల,క్యాంపు కార్యాలయాల,నయా పెత్తందారుల అభివృద్ధి ముసుగులో నిర్మిస్తున్న అవినీతి కోటలను బాహుబలిలా ఖచ్చితంగా పునాదులు కదిలిస్తారని,సూర్యాపేట గడ్డ బిడ్డలంగా బొమ్మగాని ధరంభిక్షం,భీమిరెడ్డి నరసింహారెడ్డి,ఉప్పల మల్సూర్,అలుగుబెల్లి వెంకట నరసయ్య,డేగల మధుసూదన్,మల్లు స్వరాజ్యం,కాకి లక్ష్మారెడ్డి,జన్ను భాయ్ వారసులంగా భూస్వామిక,ప్రజాస్వామిక నిరంకుశ పాలనపై మట్టి మనుషులు సాగించిన పోరాట లక్ష్యాలైన ప్రజాస్వామిక పాలన,ప్రజాస్వామిక సమాజం ఆశలు సెప్టెంబర్ 17 విలీనం తర్వాత కూడా అసంపూర్ణంగా మిగిలినవి.

వాటి సాధన కోసం మీ పిలుపును సూర్యాపేట విద్యార్థులు ఖచ్చితంగా అందుకుంటారని హామీ ఇస్తూ సెలవు.

మీ భవదీయుడు ధర్మార్జున్, తెలంగాణ జనసమితి సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube