ప్రతి దాంట్లో వేలు పెట్టి ప్రమాదాల్లో పడే మనస్తత్వం గల వారు చాలామంది ఉంటారు.ఈ తరహా మనుషులు ముందు ఏం జరుగుతుందో ఊహించకుండానే పిచ్చి పనులు చేసి కష్టాలను కోరి తెచ్చుకుంటారు.
తాజాగా ఈ కోవకు చెందిన ఓ వ్యక్తి అత్యంత క్రూర మృగమైన సింహంతోనే పరాచికాలు ఆడాడు.దీంతో చిర్రెత్తిన ఆ సింహం “నాతోనే మజాక్ చేస్తున్నావా బిడ్డ” అంటూ అతడికి చుక్కలు చూపించింది.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.
సౌతాఫ్రికాలోని సెనెగల్ ప్రాంతంలో ఓ జూ పార్కు ఉంది.ఇందులో సింహాలు, పులులు వంటి అటవీ జంతువులను ప్రదర్శనకు ఉంచారు.
అయితే అడవిలో స్వేచ్ఛగా తిరగాల్సిన ఈ జంతువులు జూలో బందీఖానగా ఉంటూ చాలా దయనీయమైన పరిస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు.దీనికి తోడు సందర్శకులు వాటిని టీజ్ చేస్తూ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఎవరూ ఊహించని రీతిలో జూపార్క్ లోని బోనులోని ఒక సింహాన్ని గెలికాడు.సింహం ముందు నిల్చొని దాన్ని రెచ్చగొట్టాడు.ఆ టైంలో సింహం దాని పని అది చేసుకుంటూ బుద్ధిగా ఉంది.దీంతో ఆ సింహాన్ని మరింత ఆటపట్టించాలని అనుకున్నాడు.అలా అనుకోవడమే కాదు దాన్ని టచ్ కూడా చేశాడు.దీంతో కోపోద్రిక్తులైన సదరు సింహం “నన్నే టచ్ చేస్తావా” అంటూ అతడి చేతిని నోట కరుచుకుంది.
దీంతో ఒక్కసారిగా షాకైన సదరు వ్యక్తి తన చేతిని సింహం నోటి నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నించాడు.కానీ ఆ సింహం అతని చేతిని గట్టిగా నోటితో పట్టుకుని తన బోనులోకి లాగడానికి ప్రయత్నించింది.
ఆ దెబ్బకు అతడు గట్టిగా కేకలు వేస్తూ కాపాడండి అంటూ మిగతా సందర్శకులను వేడుకున్నాడు.అతడి అరుపులు విన్న జూ సందర్శకులు హుటా హుటిన బోను వద్దకు చేరుకొని సింహం పై రాళ్లు రువ్వారు.
అయినా కూడా సింహం అతడి చేయి వదిలిపెట్టలేదు.చివరికి సింహం అతడి చేతిని విడిచిపెట్టింది.
దీంతో సదరు వ్యక్తి బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.అనంతరం జూ నిర్వాహకులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.