డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు థియేటర్లలో విడుదలైన సినిమా అఖండ.ఇందులో నందమూరి బాలయ్య హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
ఈయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు.
ఇక శ్రీకాంత్, పూర్ణ, సునీల్ శెట్టి తదితరులు నటించారు.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించాడు.శ్రీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.ఇక ఈ రోజు ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.
కథ:
ఇందులో బాలకృష్ణ.మురళీకృష్ణ అనే పాత్రలో నటించాడు.ఈయన ఇందులో ఫార్మరే కాదని రీ ఫార్మర్ అని అనంతపురం ప్రజలు చెబుతుంటారు.ఇక మురళి కృష్ణ ఇందులో ఫ్యాక్షనిజం వైపు అడుగులు వేసిన ఎంతో మంది ప్రజలను మంచి దారికి మలుపుతాడు.అంతేకాకుండా ఇక్కడున్న ప్రాంతాల్లో ఆస్పత్రులు, పాఠశాలలు కట్టించి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు.
ఇందులో ప్రగ్యా జైస్వాల్ కలెక్టర్ శరణ్య పాత్రలో నటిస్తుంది.ఈమె మురళి కృష్ణ చేసిన సహాయాలను చూసి మనసు పారేసుకుంటుంది.
ఆయనను పెళ్లి చేసుకుంటుంది.ఇందులో శ్రీకాంత్ వరదరాజులు అనే మైనింగ్ మాఫియా గ్యాంగ్ ను నడుపుతాడు.
ఇక యురేనియం తవ్వకాలతో అక్కడున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో వెంటనే మురళీకృష్ణ మైనింగ్ మాఫియా చేస్తున్న వారిని పట్టుకోడానికి రంగంలోకి దిగుతాడు.ఆ తర్వాత మురళీకృష్ణ ఎదురుకున్న సవాళ్ళు.మధ్యలో చిన్నప్పుడు ఇంటి నుండి వెళ్ళిపోయిన మురళీకృష్ణ తమ్ముడు శివుడు (బాలకృష్ణ) కనబడటం అసలు అతను ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలు మిగిలిన కథలో చూడవచ్చు
నటినటుల నటన:
ఇందులో బాలకృష్ణ మురళి కృష్ణ పాత్రలో అద్భుతంగా నటించాడు.కలెక్టర్ పాత్రలో ప్రగ్యా జైస్వాల్ అదరగొట్టింది.సెకండాఫ్ లో అఘోర పాత్రలో మాత్రం ఫిదా చేశాడు బాలయ్య.ఇక శ్రీకాంత్ మాఫియా పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు.పూర్ణ కూడా తన పాత్రలో లీనం అయ్యింది.
టెక్నికల్:
ఈ సినిమా టెక్నికల్ గా ప్రతి ఒక్క విషయంలో ఆకట్టుకుంది.బోయపాటి మంచి కథను రూపొందించాడు.సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.బ్యాగ్రౌండ్ కూడా బాగా ఆకట్టుకుంది.తమన్ తన సంగీతాన్ని అద్భుతంగా అందించాడు.
విశ్లేషణ:
ఈ సినిమాలో కథ బాలకృష్ణ కోసం అన్నట్లుగానే రూపొందించాడు బోయపాటి.ఇక బాలయ్య డాన్స్ కూడా బాగా అదరగొట్టాడు.రెండు పాత్రలతో బాలయ్య ప్రేక్షకులను మెప్పించాడు.అఘోర తో తలపడే సన్నివేశాలు మాత్రం బాగా హైలెట్ గా ఉన్నాయి.క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది.ఈ సినిమాను మాస్ పరంగా అద్భుతంగా తెరకెక్కించారు.
ప్రకృతి గురించి, దైవం గురించి ఇలా కొన్ని కొన్ని విషయాల గురించి అద్భుతంగా విశ్లేషించారు.
ప్లస్ పాయింట్స్:
బాలకృష్ణ డైలాగ్స్, పాటలు, సినిమా కథ, ద్విపాత్రాభినయం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్, సెకండాఫ్
మైనస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించింది.
బాటమ్ లైన్:
కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను థియేటర్ లో అస్సలు మిస్ కావద్దు.