అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వలస వాసులు ఎవరైనా సరే హెచ్1 –బి వీసా ను తప్పకుండా పొంది ఉండాల్సిందే.ఈ వీసా కోసం ఏ స్థాయిలో పోటీ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అయితే ప్రస్తుతం హెచ్1 –బి వీసా లకు కాలం చెల్లిందని, ఈ వీసాలను పొందేందుకు వలస వాసులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అంటోంది అమెరికా కార్మిక శాఖ.గతంలో ఉన్న భారీ డిమాండ్ ఏడాది గడుస్తున్న కొద్దీ తగ్గుతోందని, ఈ పరిస్థితి ఎన్నడూ చూడలేదని వెల్లడించింది.
అయితే కార్మిక శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా బ్లూమ్ బర్గ్ న్యూస్ అందించిన విశ్లేషణ ప్రస్తుతం అందరిని ఆలోచింపజేస్తోంది.
బ్లూమ్ బర్గ్స్ న్యూస్ నివేదిక ప్రకారం 2020 తో పోల్చి చూస్తే ఇంజనీరింగ్, మాథ్స్ విభాగాలలో ఉద్యోగాలు చేసే వలస వాసులు 12.5 శాతం తగ్గిపోయారట.అయితే ఆ గడిచిన 2019 ఏడాది తో పోల్చితే 19 శాతం తగ్గిపోయారని తెలిపింది.2020 మార్చి మొదటి నుంచీ వీసాల జారీ ప్రక్రియ అసలు ఏ మాత్రం జరగలేదని, ఈ పరిస్థితులకు ప్రధాన కారణం కరోనా వలన కలిగిన లాక్ డౌన్, ఆంక్షలేనని ప్రకటించింది.ఇదిలాఉంటే అమెరికాలోని పలు కంపెనీలు విదేశాలలో ఉన్న వారికి సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ కు అనుమతులు ఇచ్చాయని, దాంతో ఈ వీసాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదని తెలిపింది.
ఈ సంవత్సరం అమెరికాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య 2.30 లక్షలు కాగా, ఈ ఆర్ధిక సంవత్సరం లో మొత్తం 4.97 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని అమెరికా కార్మిక శాఖ వెల్లడించింది.2020 నుంచీ 2019 వరకూ పోల్చి చూస్తే దాదాపు 26 శాతం ఉద్యోగ ఖాళీలు పెరిగాయని, ఇదిలాఉంటే ప్రస్తుతం ఇన్ని ఉద్యోగాల భర్తీ చేపట్టాలంటే ముందుగా హెచ్-1 బి వీసా దారుల పెరుగుదల ఉండాలని.లేదంటే భవిష్యత్తులో ఉద్యోగాల కొరత భారీగా పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు
.