1.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.మంగళవారం తిరుమల శ్రీవారిని 27,482 మంది భక్తులు దర్శించుకున్నారు.
2.ఎంబీఏ సెకండ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
గతేడాది డిసెంబర్లో నిర్వహించిన ఎస్వీ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి.
3.ఫీజులపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు
తెలంగాణలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
3.పక్షపాతానికి ఉచిత చికిత్స శిబిరం
శ్యాం మందిర్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 27 వ తేదీ వరకు పక్షవాతానికి ఆధునిక పరికరాలతో ఉచిత చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు హ్యుమానిటీ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండ శ్రీనివాసరావు తెలిపారు.
4.కెసిఆర్ కీలక సమావేశం
తెలంగాణ లో డ్రగ్స్ నివారణపై కార్యాచరణ రూపొందించేందుకు ప్రగతి భవన్ లో సంబంధిత అధికారులతో సీఎం కేసీఆర్ నేడు సమావేశం నిర్వహిస్తున్నారు.
5.చంద్రబాబు ఇంటికి భద్రత
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో ని ఆయన ఇంటికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
6.అమరావతి ఆందోళనలు
రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అంటూ రైతులు చేపట్టిన ఆందోళనలు నేటికి 672 వ రోజుకి చేరుకున్నాయి.
7.తెలుగు అకాడమీ కేసు
తెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ కేసులో తాజాగా మరో నిందితుడు కృష్ణా రెడ్డి ని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
8.లోకేష్ పై హత్యాయత్నం కేసు
నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
9.కెసిఆర్ బహిరంగ సభ
ఈనెల 27న పెంచికల్ పేట లో తెలంగాణ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
10.నల్లమలలో పులుల గణన ప్రారంభం
నల్లమల అడవులలో పులుల గణన ఫారెస్ట్ అధికారులు ప్రారంభించారు.
11.దళిత బంధు పై ఈసీ నివేదిక
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో దళిత బంధు అమలు తీరు పై ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ భారత ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు.
12.గృహ హింస కేసులో క్రికెటర్ అరెస్ట్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ స్లేడర్ ను గృహ హింస కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.
13.ప్రధానికి చంద్రబాబు లేఖ
ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.పేదరికంతో బాధ పడుతున్న వాల్మీకి బోయ కులాలను షెడ్యూల్ తెగలలో చేర్చాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
14.నిరసన దీక్షకు సిద్ధమైన చంద్రబాబు
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిరసన దీక్షకు సిద్ధమయ్యారు.నిన్న టిడిపి ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న సంఘటనకు నిరసనగా 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు.
15.లార్డ్ నూతన ప్రచారకర్తగా రష్మిక
లాట్ మొబైల్ షోరూం నూతన ప్రచార కార్యకర్తగా ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన నియామకం అయ్యారు.
16.నేడు ఉత్తరాఖండ్ కు అమిత్ షా
ఉత్తరాఖండ్ లోని వరదలు అందుతున్న సాయం ను పరిశీలించేందుకు నేడు అమిత్ షా అక్కడ పర్యటిస్తున్నారు.
17.ఏపీకి కేంద్ర బలగాలు పంపాలి : రఘురామ
ఏపీ ల నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి కి వైసిపి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ లు రాశారు.వెంటనే కేంద్ర బలగాలను ఏపీకి పంపించాలని లేఖలో కోరారు.
18.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14, 623 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.గాంధీ ఆసుపత్రి లో మంటలు
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది.లేబర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 46,490 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,490