బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా ఎదిగిన నటుడు ప్రభాస్.ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ హీరో.ఆ తర్వాత మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు.అదే సమయంలో రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి సినిమా చేశాడు.ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది.
హీరోగా ప్రభాస్ స్థాయిని ఓ రేంజికి పెంచింది.ఈ సినిమాతో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
ఆ తర్వాత వచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ స్థాయి ఎవరికీ అందనంత ఎత్తుకు తీసుకెళ్లింది.ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కాసేపు ప్రభాస్ సినిమాల విషయాన్ని గురించి పక్కన పెడితే.ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.అయితే ప్రభాస్ తండ్రి గురించి మాత్రం చాలా మందికి తెలియదు.
నిజానికి ఆయన కూడా సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే.తన పేరు సూర్య నారాయణ రాజు.
అప్పట్లో ఆయన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహిరంచాడు.కృష్ణంరాజుతో కలిసి గోపి మూవీ బ్యానర్ మీద ఎన్నో సినిమాలను నిర్మించాడు.
సినిమా పరిశ్రమలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అదే సమయంలో ప్రభాస్ ను హీరోగా చేయాలి అనుకున్నాడు.
కానీ అప్పట్లో ప్రభాస్ కు సినిమాలు చేయాలనే ఇష్టం ఉండేది కాదు.
ఆ తర్వాత తన పెదనాన్న కూడా సినిమా పరిశ్రమ నుంచి తప్పుకోవాలి అనుకున్నాడు.తనకు పిల్లలు లేరు.ఈ కారణంగా ప్రభాస్ ను తన నట వారసుడిగా సినిమాల్లోకి తీసుకురావాలి అనుకున్నాడు.
ఇదే విషయాన్ని తండ్రి, పెదనాన్న ఇద్దరూ ప్రభాస్ కు నచ్చేలా చెప్పారు.వీరి కోరిక మేరకు ప్రభాస్ సినిమాల్లోకి వచ్చేందుకు అంగీకరించాడు.
ఈశ్వర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు.