దేశంలోని టాలెంటెడ్ స్టార్ హీరోలలో కమల్ హాసన్ ఒకరనే సంగతి తెలిసిందే.అయితే దశావతారం తర్వాత కమల్ హాసన్ నటించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో విఫలమయ్యాయి.
అయితే విక్రమ్ సినిమాతో కమల్ హసన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.విక్రమ్ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించడం గమనార్హం.
ఫుల్ రన్ లో ఈ సినిమా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.విక్రమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమల్ హాసన్ మాట్లాడుతూ విక్రమ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పంట పండిస్తోందని అన్నారు.
ఖైదీ మూవీని చూసిన తర్వాత తాను లోకేష్ కనగరాజ్ కు తను హీరోగా తెరకెక్కే సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చానని కమల్ కామెంట్లు చేశారు.
విక్రమ్ మూవీ మంచి మూవీ అవుతుందని తాను నమ్మానని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.
అయితే లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేశాడని కమల్ హాసన్ వెల్లడించారు.మరో చరిత్ర సినిమా సక్సెస్ సాధించడం ద్వారా తెలుగులో తనకు సక్సెస్ సాధించే అవకాశం దక్కిందని ఆయన తెలిపారు.మరో చరిత్ర సినిమా తెలుగు వెర్షన్ చెన్నైలో సబ్ టైటిల్స్ లేకుండా రెండున్నరేళ్లు ప్రదర్శితమైందని కమల్ హాసన్ వెల్లడించారు.
సినిమా భాష ప్రపంచ భాష అని కమల్ హాసన్ కామెంట్లు చేశారు.సినిమాకు భాష లేదని కమల్ హాసన్ తెలిపారు.కమల్ హాసన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కమల్ హాసన్ తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.కమల్ తర్వాత సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.