బేబీ సినిమా ( Baby movie )తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన యూట్యూబర్ వైష్ణవి చైతన్య( Vaishnavi chaitanya ) హీరోయిన్ గా బిజీ అయింది.తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా పనికి రారు అనుకున్న సమయంలో అనూహ్యంగా వైష్ణవి కి ఛాన్స్ దక్కింది.
ఆమెకు వస్తున్న ఆఫర్లను చూసి చాలా మంది ఉత్తరాది ముద్దుగుమ్మలు కూడా నోరు వెళ్లబెడుతున్నారు.బాబోయ్ ఏంటి ఈ రచ్చ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఓ రేంజ్ లో ఆఫర్లతో దూసుకు పోతుంది.ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోయిన్ కూడా తీసుకోని పారితోషికం ను ఈమె తీసుకుంటుంది అంటూ సమాచారం అందుతోంది.మొత్తానికి యూట్యూబ్ ద్వారా ప్రేక్షకులు పరిచయం అయిన ముద్దుగుమ్మ వైష్ణవి చైతన్య ( Vaishnavi chaitanya ) ప్రస్తుతం హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా హీరోయిన్ గా ఎక్కువ పారితోషికం తీసుకుంటూ అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది.ప్రస్తుతం బేబీ ఇమేజ్ తో వైష్ణవి ఏకంగా 75 నుంచి 85 లక్షల రూపాయల వరకు పారితోషికంగా అందుకుంటుంది.
మరో సినిమా తో హిట్ పడితే కచ్చితంగా కోటి రూపాయలకు మించే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
ఓ రేంజ్ లో బేబీ పారితోషికం విషయం లో దూసుకు పోతూ ఉంటే మరి కొందరు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా నటించేందుకు గాను ఆఫర్లు లేక ఢీలా పడి పోయారు.ఇప్పటి వరకు ఏం చేయాలో అర్థం కాక స్టార్ కిడ్ అయిన శివాని మరియు శివాత్మిక లు హీరోయిన్స్ గా ఆఫర్ల కోసం వెతుక్కుంటున్నారు.అలాంటి వారు అవాక్కయ్యే విధంగా కోటి పారితోషికం కు వైష్ణవి చైతన్య( Vaishnavi chaitanya ) చేరువ అవ్వడం నిజంగా అద్భుతం అనడంలో సందేహం లేదు.
ముందు ముందు బేబీ సినిమా క్రేజ్ తో మరింతగా ఈ అమ్మడు ఆఫర్లు దక్కించుకున్న ఆశ్చర్యం లేదు అంటున్నారు.