సినిమా ఇండస్ట్రీ అంటే అదొక మహాసముద్రం.ఎంతోమంది నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వచ్చిన వాళ్ళు స్టార్స్ గా ఎదిగే వాళ్లలో చాలా తక్కువ మందే.
సినిమా అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే ఈ పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని కాపాడుకొని మరిన్ని అవకాశాలు తెచ్చుకోవడం మరొక ఎత్తు.వచ్చిన ప్రతి అవకాశాన్ని తీసుకున్న కూడా కొన్నిసార్లు పరాభవాలు తప్పవు.
అందుకే నటీనటులు వాళ్ళ దగ్గరికి వచ్చిన అవకాశాల్లో ఆచితూచి కొన్ని మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు.కొన్నిసార్లు కొన్ని మంచి సినిమాలు కూడా అలా వారికి మిస్ అవుతూ ఉంటాయి.
అలా పూజ హెగ్డే కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది.ఇక కొన్నిసార్లు సినిమా కథ బాగున్నా కూడా ఆ సమయానికి డేట్స్ ఇవ్వకపోవడం కూడా ఆ సినిమా తన నుంచి మిస్ అవ్వడానికి కారణం అవుతుంది.మరి పూజ వదిలేసిన ఆ సినిమాలేంటి? అందులో ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫ్లాప్ అయ్యాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వకీల్ సాబ్
పూజా హెగ్డే రిజెక్ట్ చేసిన సినిమాల్లో అతి ముఖ్యమైన సినిమా పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్.ఈ సినిమాలో శృతిహాసన్ పాత్ర కోసం తొలుత పూజా హెగ్డే ని అడిగారట.కానీ కారణమేంటో తెలియదు కానీ ఆ సినిమాని పూజా రిజెక్ట్ చేసింది.
మాస్ట్రో
బాలీవుడ్ సినిమా అందాదున్ కి రీమేగా తెలుగులో వచ్చిన సినిమా మాస్ట్రో.ఈ సినిమాలో తమన్నా, టబు, నితిన్ ప్రదాన పాత్రలు పోషించగా తమన్నా నటించిన పాత్ర కోసం తొలుత పూజ హెగ్డే ని అడిగారట.కానీ ఈ సినిమాను కూడా ఆమె వదులుకుందట.
శాకుంతలం
సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న శకుంతలం సినిమాలో మొదట పూజా హెగ్డేని నటింపజేయాలని సినిమా యూనిట్ భావించిందట.కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శకుంతలం సినిమా నుంచి తప్పుకుందట పూజ.ఇవే సినిమాలు కాకుండా పలు బాలీవుడ్ సినిమాలను సైతం పూజ రిజెక్ట్ చేయడం విశేషం.వాటిలో చెప్పుకోదగ్గ సినిమాలు చత్రపతి రీమేక్ గా బెల్లంకొండ శీను హీరోగా వస్తున్న చిత్రం, అలాగే అలాగే గుడ్ బై, హిందీ మూవీ అటాక్, హీరో వంటి సినిమాలు సైతం పూజ రిజెక్ట్ చేసిందట.ఇలా కొన్ని సినిమాలు వదులుకోవడం కూడా పూజకి కలసి వచ్చింది.