పాము విషయం మనిషిని ఏం చేస్తుంది ? కుదరితే గంటలోపే చంపేస్తుంది.ఎన్ని నిమిషాల్లో, ఎన్ని గంటల్లో మనిషి చనిపోతాడు అనే విషయం ఆ విషాన్ని వదిలిన పాముని బట్టి మారిపోతూ ఉంటుంది.
కొన్ని పాములు ఎంత విషపూరితంగా ఉంటాయంటే, కాటు పడిన అరగంటలో వైద్యం అందకపోతే ఇక ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే.పోని చనిపోయే ముందు మనిషి ఊరికే అలా చనిపోతాడా? లేదు .చిత్రహింసలు పడతాడు.తలబాదేసినట్టు ఉండే తలనొప్పి, వాంతులు, రక్తం గడ్డకట్టిపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్ళంతా నొప్పులు .అబ్బో ఇంకా చాలా ఉంటాయి.ఇక బ్రతికి ఉండటం కన్నా చనిపోవడం మేలు అనేలా ఉంటుంది ఆ నరకం.
మరి పాము విషం అలాంటిది.కాని పాము విషం కేవలం మనుషుల ప్రాణాలు తీస్తుంది అనుకుంటే పొరపాటే .పాము విషం మనుషులకి ప్రాణం పోస్తుంది కూడా.ఎలానో చూడండి.
* పాము విషంలో ఎన్నో బయోలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి.వాటితో మెడిసిన్స్ కూడా తయారు చేస్తారు
* టునీసియన్ వైపర్స్ జాతి పాముల విషంలో లభించే Phospolipases Type A2 తో ట్యూమర్స్ ని ట్రీట్ చేయవచ్చు
* Phospilipases Type A2 ని యాంటిబయాటిక్స్ లో వాడటం విశేషం.
ఇవి బ్యాక్టీరియా ఉండే సెల్స్ ని పోగడతాయి కూడా
* పాము విషంలో పేన్ కిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయని కనుగొన్నారు శాస్త్రవేత్తలు.పాము విషంలో ఉండే ప్రోటీన్స్ ద్వారా నొప్పులని పోగట్టవచ్చునట
* పాము తన విషంలోని మాలుక్యూల్స్ ని ప్రమాదం కలిగించకుండా మార్చగలుగుతుందట.
అలాంటి విషంతో క్యాన్సర్ ట్రీట్‌మెంటు చేయవచ్చు అని ఒక ఆస్ట్రేలియన్ రిసెర్చి టీమ్ తెలిపింది.
* బ్రెజిలియన్ పిట్ వైపర్ అనే పాము విషంలో ఉండే ప్రోటీన్లు బ్లడ్ ప్రెషర్ సమస్యలను దూరం చేస్తుందట.
దీనిలో ACE అనే కంపౌండ్ ఉండటం వలన ఇది సాధ్యపడుతుంది
* పాము విషంలోని హోమోటాక్సిన్స్ తో కొన్ని మందులని తయారుచేస్తున్నారు.వీటి ద్వారా హార్ట్ ఎటాక్ సమస్యలు ఉండే పేషెంట్స్ ని ట్రీట్ చేస్తున్నారు.
సీరియస్ గా ఉండే ఛాతి నొప్పులపై కూడా ఈ మందులు పనిచేస్తాయి
* పాము విషంలోని న్యూరోటాక్సిన్స్ తో తయారుచేసే మందులతో బ్రెయిన్ స్ట్రోక్, మతిమరుపు, మెదడులో గాయాల్ని నయం చేస్తారు
* పాము విషంతో ట్యూమర్స్ ని నయం చేయడమే కాదు, ట్యూమర్స్ పెద్దగా అవకుండా అడ్డుకోవచ్చు కూడా.అయితే ఈ వైద్యంపై ఇంకా కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి
నోట్ : పాము విషంతో డ్రగ్స్ తయారుచేసి వాటిని రకరకాల ట్రీట్‌మెంటు కి వాడతారు.ఏ పాము విషం ఎటువంటి ఉపయోగాలు కలిగి ఉంటుందో సామన్య ప్రజలకు అర్థం అవడం చాలా కష్టమైన విషయం.కాబట్టి పాము విషంతో సొంతంగా ఎలాంటి ప్రయోగాలు చేయవద్దు.