తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy )తో సీనియర్ నేత కే కేశవరావు భేటీ అయ్యారు.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరే అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో కేకే చర్చిస్తున్నారని తెలుస్తోంది.
ఆయన బీఆర్ఎస్( BRS ) ను వీడి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ సమక్షంలో హస్తంగూటికి చేరతారని సమాచారం.కాగా ఇటీవల కేకే కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ( Gadwal Vijayalakshmi ) కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం రేవంత్ రెడ్డితో కేకే సమావేశం కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.