ఈ రోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి అనే విషయం తెలుగు ప్రజలకు బాగా తెలుసు.ఈయన తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చాడు.
ఈయన కారణంగానే మన తెలుగు సినిమా గర్వంగా తలెత్తుకుంది.ఈయన సినిమాల్లోనే కాకుండా ప్రజా సమస్యలపై కూడా తన మార్క్ చూపించాడు.
తెలుగు రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకువచ్చి ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడిన ఆ మహనీయుని స్మరించుకుంటూ నందమూరి అభిమానులే కాకుండా కుటుంబ సభ్యులతో పాటు తెలుగు ప్రజలు కూడా ఆయనను తలచు కుంటూ నివాళులు అర్పిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే నందమూరి తారక రామారావు మనవడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా తాత కు నివాళులు అర్పించారు.
ఆయనకు తన తాత మీద ఉన్న ప్రేమను మరోసారి నిరూపించు కున్నాడు.
ఈయన సోషల్ మీడియాలో తన తాతపై ఎంత ప్రేమ ఉందో దానిని మాటల్లో వర్ణించ లేనిది అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసాడు.ఎన్టీఆర్ ఎంత ఎత్తుకు ఎదిగిన ఆయన తాత పై ఉన్న ప్రేమను మరువలేడు.అంతలా ఆయనపై ప్రేమను, గౌరవాన్ని అయన నరనరాల్లో నింపుకుని తాత 100వ జయంతి రోజు భావోద్వేగానికి లోనయ్యాడు తారక్.
ఈయన పోస్ట్ చేస్తూ.”మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది.ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొకసారి తాకిపో తాత. సదా మీ ప్రేమకు బానిసను.”అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా పోస్ట్ చేసాడు.ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వగా నందమూరి అభిమానులు కూడా భావోద్వేగం వ్యక్తం చేస్తున్నారు.