ప్రస్తుత కాలంలో కొందరు మనుషులు పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రవర్తించేటువంటి ప్రవర్తన కారణంగా కటకటాల పాలవుతున్నారు.తాజాగా ఓ వైద్యురాలిని ఇల్లు ఖాళీ చేయించేందుకు గాను ఆమెతో అసభ్య కరంగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలంతో దూషిస్తు, ఏకంగా అత్యాచారం చేస్తానంటూ బెదిరించి ఘటన
ఒరిస్సా
రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే ఓ మహిళ స్థానిక రాష్ట్రంలోని
భువనేశ్వర్
నగరంలో ఉన్నటువంటి ఓ ఇంటిలో నివాసముంటుంది.అయితే ఈమె వృత్తి రీత్యా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో
జూనియర్ వైద్యురాలు
గా పనిచేస్తోంది.
ప్రస్తుతం కకరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ వైద్యులు మాత్రం నిరంతరం సేవలు అందిస్తూనే ఉన్నారు.ఇందులో భాగంగా ఈ మహిళ కూడా రోజూ ఆసుపత్రికి వెళుతూ ఉండేది.
దీంతో తాను ఉన్నటువంటి
అపార్ట్మెంట్ హౌసింగ్ బేరర్
ఆమెని ఇల్లు ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చాడు.
అంతేగాక వైద్యురాలు రోజు కరోనా వైరస్ సోకినటువంటి పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తుండడంతో ఆమె ద్వారా ఇతరులు కూడా వ్యాపిస్తుందని రోజూ ఇల్లు ఖాళీ చేయాలంటూ బలవంతం చేస్తున్నాడు.
దీంతో సదరు మహిళా వైద్యురాలు ఉన్నట్లుండి ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నించింది అంతేగాక తనకు కొంత కాలం పాటు గడువు ఇవ్వాలని కూడా కోరింది.
అయినప్పటికీ ఆ హౌసింగ్ బేరర్ వినకుండా ఆమెపై అసభ్య పదజాలం ఉపయోగిస్తూ దూషించ సాగాడు.
అంతేగాక ఇటీవలే ఇంకో రెండు మూడు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే రేప్ చేస్తానంటూ బెదిరించాడు.దీంతో భయపడినటువంటి మహిళా వైద్యురాలు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.
అంతేగాక తనను ఇల్లు ఖాళీ చేయకపోతే అతయచరం చేస్తానంటూ బెదిరిస్తున్న హౌసింగ్ బేరర్ పై ఫిర్యాదు నమోదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన టువంటి
పోలీసులు
వెంటనే హౌసింగ్ బేరర్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.