నల్లగొండ మున్సిపల్ చైర్మన్ పై మొదలైన అవిశ్వాసం...!

నల్లగొండ జిల్లా:నల్లగొండ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిపై సోమవారం అవిశ్వాస తీర్మానం మొదలైంది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ( Congress Party ) క్యాంపు రాజకీయాలకు తెరలేపి 34 మంది కౌన్సిలర్లను శనివారం క్యాంపునకు తరలించింది.

 Disbelief Started On Nalgonda Municipal Chairman , Nalgonda Municipal Chairman,-TeluguStop.com

నేరుగా మున్సిపల్‌ సమావేశ మందిరానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.బీఆర్‌ఎస్‌ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవిశ్వాసం నెగ్గకుండా ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తున్నది.

ఇందుకు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కౌన్సిలర్లకు ఆ పార్టీ విప్‌ జారీ చేసింది.కొంతమందికి విప్‌ అందజేయగా మరికొందరు అందుబాటులో లేకపోవడంతో వారి ఇండ్ల వద్ద స్లిప్పులు అంటించారు.

ఒకవేళ బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన వారిపై చర్యలు తీసుకునేలా ఇప్పటికే విప్‌ జారీ చేసి సంబంధిత కాపీలను కలెక్టర్‌కు అందజేశారు.గతంలో కనగల్‌ మండలంలో విప్‌ ధిక్కరించిన వారు పదవులు కోల్పోవడంతోపాటు ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

దాంతో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి పోయిన కౌన్సిలర్లలో కొంత అలజడి మొదలైంది.పదవి కోల్పోవాల్సి వస్తే తమ పరిస్ధితి ఏంటని అందోళన చెందుతున్నట్లు సమాచారం.కాంగ్రెస్‌ క్యాంపులో ఉన్నప్పటికీ ఓటు వేయాలా వద్దా అనే డైలామాలో ఉన్నట్లు వినికిడి.15 మంది కౌన్సిలర్లకు పదవి గండం నల్లగొండ మున్సిపాలిటీలో 48 వార్డులకు బీఆర్‌ఎస్‌ 20,కాంగ్రెస్‌ 20,బీజేపీ 6, ఎంఐఎం ఒకటి,స్వతంత్రులు ఒకరు గత ఎన్నికల్లో విజయం సాధించారు.ఎంఐఎం, స్వతంత్రులు,ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలుపుకొని అప్పట్లో బీఆర్‌ఎస్‌ చైర్మన్‌,వైస్‌ చైర్మన్‌ పదవులను దక్కించుకుంది.తరువాత కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ మృతి చెందడంతో అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్ది విజయం సాధించాడు.

కాంగ్రెస్‌కు చెందిన మరో కౌన్సిలర్‌ బీఆర్‌ఎస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల సంఖ్య 22కు కాంగ్రెస్‌ సంఖ్య 18కి చేరింది.శాసససభ ఎన్నికలు సమయంలో బీఆర్‌ఎస్‌కు చెందిన 9 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు.

ఎన్నికల తరువాత మరో ఆరుగురితోపాటు స్వతంత్రులు కలిపి మొత్తం ఏడుగురు కాంగ్రెస్‌లో చేరారు.దాంతో మున్సిపాలిటిలో కాంగ్రెస్‌ బలం 34కు చేరింది.వీరంతా కలిసి చైర్మన్‌పై అవిశ్వాసం ప్రకటించారు.ఈ అవిశ్వాసం నెగ్గితే బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 15 మంది కౌన్సిలర్లకు పదవి గండం ఏర్పడనుంది.

కాగా,అవిశ్వాస పరీక్షలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్‌ యంత్రాంగం భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube