తహాసీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యాన్ని పెట్టుకుని మానిటర్ చేయాలి.వచ్చే సోమవారం కల్లా పెండింగ్ రెవిన్యూ సమస్యలు పరిష్కరిoచాలి తహశీల్దార్ లతో నిర్వహించిన వీడియో కాన్ఫేరెన్స్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా :వచ్చే 15 రోజుల్లోగా సీఎంఆర్ డెలివరీ లక్ష్యాన్ని పూర్తి చేయాలని జిల్లాలోని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు నమోదు దరఖాస్తుల పరిష్కారం సహా పలు అంశాలపై ఆర్డీఓ లు, తహశీల్దార్ లకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఐడిఓసి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం దిశా నిర్దేశం చేశారు.జిల్లాలోని తాసీల్దార్లు అన్ని రైస్ మిల్ లు రన్ అయ్యేలా మానిటర్ చేయాలని చెప్పారు.
సీఎంఆర్ రోజూ వారి టార్గెట్ నిర్దేశించుకునీ టార్గెట్ పూర్తి చేయాలని సూచించారు.ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు.అనంతరం ధరణి, ఇతర భూసంబoధిత సమస్యలఫై సమీక్షీంచారు.హైకోర్ట్ , ఇతర ఉన్నత న్యాయ స్థానాల పెండింగ్ కేసుల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.
కోర్ట్ ఆర్డర్ ప్రకారం టైమ్ లైన్ లో అర్జీలను పరిష్కరించాలని చెప్పారు.తహశీల్దార్ లు అందరూ భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు.
మ్యుటేషన్, సక్షేషన్ మినహా మిగితా దరఖాస్తులు పెండింగ్లో ఉండవద్దన్నారు.అలాగే మీసేవ సర్వీసెస్ పెండింగ్ పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
మండలాలలో కుల, ఆదాయ సర్టిఫికెట్ , తదితర సర్టిఫికేట్ లు పెండింగ్ లేకుండా రోజు వారిగా క్లియర్ చేయాలన్నారు.మీ సేవా సర్వీసెస్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను మిషన్ పరిష్కరించాలలని ఆదేశించారు.
త్వరలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఫారం -6,7,8 దరఖాస్తుల పరిష్కారం పై దృష్టి పెట్టాలని సూచించారు.ఓటరు జాబితాలో డబుల్, డూప్లికేట్, డెత్ ఓటర్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అర్హులైన యువతను ఓటర్లుగా నమోదు పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.ఓటు నమోదుకు అర్హతగల పూర్వ విద్యార్థుల వివరాలను పాఠశాలల నుంచీ తీసుకుని వారిలో ఎవరైనా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోకుంటే వారిని వెంటనే నమోదు చేసుకునేలా చూడాలన్నారు.
ఈ నెల 22 వ తేదీ తర్వాత బి ఎల్ ఓ నుండి తమ బూత్ పరిధిలో డూప్లికేట్ ఓటరు లు లేరనే సర్టిఫికేట్ తీసుకోనున్నందున అర్హత గల ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు కు, ఆరోగ్యకర ఓటరు జాబితా తయారీకి ఓటు హక్కు నమోదు కోసం తహసిల్దార్లు బీఎల్ఓ లు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి సూపర్ వైజర్లతో సమావేశం నిర్వహించాలని సూచించారు.ధరణీ పెండింగ్ అర్జీలను వచ్చే శనివారం లోగా పరిష్కరించాలని, సంబంధిత రిపోర్ట్ ను అందజేయాలని తహశీల్దార్ లను కలెక్టర్ ఆదేశించారు.
శనివారం సాయంత్రం కల్లా ఏ మండలాలలో అతి ఎక్కువ ధరణీ పెండింగ్ అర్జీలు ఉంటే సంబంధిత టాప్ 3 మండలాల తహశీల్దార్ లు సోమవారం కలెక్ట రెట్ కు వచ్చి క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్లు ఎన్ ఖిమ్యా నాయక్, పూజారి గౌతమి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి గంగయ్య ,జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి ,పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ జితేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
.