రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం తిప్పాపూర్ గ్రామానికి మానుక కుంటయ్య అనే వ్యక్తి గతంలో వామపక్ష తీవ్రవాద గ్రూపు జనశక్తి పార్టీలో పనిచేసి, ఆ తర్వాత లొంగిపోయి, భూ సమస్యలపై జోక్యం చేసుకుని, ఆస్తుల యజమానులను బెదిరించి, అమాయక ప్రజల బెదిరించి వారి నుంచి డబ్బు వసూలు చేసేవాడు.మనుక కుంటయ్య నేర కార్యకలాపాలను నిరోధించడానికి జిల్లా పరిధిలో భూ సంబంధించిన విషయాల్లో గతంలో 08 కేసులలో నిందుతునిగా ఉన్నప్పటికీ తన కార్యకలపలను మార్చుకొనప్పటకి కుంటయ్య మీద గతంలో
వేములవాడ టౌన్ పోలీస్ వారు “రౌడీ షీట్” కూడా తెరవబడింది.
అయిన కూడా కుంటయ్య నిరంతరం నేర కార్యకలాపాలను కొనసాగిస్తు ప్రజలను బయబ్రాంతులకు గురి చేస్తున్న మనుక కుంటయ్య మీద రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పి.డి యాక్ట్ అమలు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ,జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ టౌన్ సి.ఐ కరుణాకర్ మనుక కుంటయ్య కు పిడి యాక్ట్ నిర్బంధ ఉత్తర్వులు అందజేసి బుధవారం (07-02-2024) రోజున నిందుతున్నీ చర్లపల్లి కర్మాగారనికి తరలించడం జరిగింది.