ఎల్లారెడ్డిపేట కేడీసీసీ బ్యాంకులో దోపిడీకి దొంగల యత్నం

లాకర్ తీయడానికి విఫల యత్నం సమాచారం అందుకున్న పోలీసులు జాగిలాలు, క్లూస్ టీం ఆధారాలతో ఫింగర్ ప్రింట్స్ సేకరణ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో ఆదివారం రాత్రి దొంగలు దోపిడీకి విఫల యత్నం చేశారు.లాకర్ ను విప్పే ప్రయత్నం చేశారు.

 Thieves Attempt To Rob Kdcc Bank In Ellareddypet , Ellareddypet, Kdcc Bank-TeluguStop.com

లాకర్ తెరుచుకోకపోవడంతో విఫలమై పారిపోయారు.కేడీసీసీ బ్యాంకు( KDCC Bank ) వద్ద నిర్మాణం పనులు జరుగుతున్నాయి.

దానికోసం బస్టాండు వైపున తూర్పు దిక్కున లేబర్ పలంచ కట్టారు.పలంచ ద్వారా రెండువ అంతస్తులో ఉన్న కెడిసిసి బ్యాంకు లోనికి అల్యూమినియం స్లయిడింగ్ విండో నుంచి లోనికి ప్రవేశించిన దొంగలు మొదట బ్యాంకు లోని సి సి కెమెరాలకు సంబంధించిన వైరింగ్ ను కట్ చేశారు.

అనంతరం బ్యాంకు లోపల ఉన్న రెండు సెంటర్ల ను ఇనుప రాడ్ సాయంతో పైకి ఎత్తి లాకర్ వద్దకు వెళ్లి లాకర్ ను ఇనుప రాడ్ సాయంతో విప్పే ప్రయత్నం చేశారు.అది ఓపెన్ కాకపోవడంతో విఫలమై దొంగలు బ్యాంకు లోని పైల్లను చిందరవందర చేసి పారిపోయారు.

సోమవారం ఉదయం వాచ్ మెన్ అనిల్ ప్రతిరోజు లాగా వచ్చి బ్యాంకును శుభ్రం చేస్తుండగా చిందరవందరగా పడి ఉన్న ఫైళ్లను లాకర్ నపరిశీలించి చూడగా దొంగలు బ్యాంకు దోపిడీ కి యత్నించినట్లు గమనించి వెంటనే బ్యాంకు మేనేజర్ సంపూర్ణకు సమాచారం అందించాడు.అప్పటికి మేనేజర్ సంపూర్ణ తో పాటు బ్యాంకు సిబ్బంది బ్యాంకులో చిందరవందరగా పడి ఉన్న సమాచారాన్ని ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రేమ్ దీఫ్ కు సమాచారం అందించగా హుటాహుటీన ఎస్సై పోలీస్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

అనంతరం డాగ్స్ స్కాడ్ ఇంచార్జీ శ్రీనివాస్, సంతోష్ లు రాంబో డాగ్ తో బ్యాంకు చుట్టూ పరిసరాలను తనిఖీ చేయించారు.అనంతరం ఫింగర్ ప్రింట్ సిబ్బంది బ్యాంకులోని లాకర్ ను అక్కడ దొంగలు వదిలి వెళ్ళిన ఇనుప రాడ్ ను, బ్యాంకు పని చేస్తున్న వర్కర్ల వేలిముద్రలను సేకరించారు.

అనంతరం ఎస్సై ప్రేమ్ దీప్ సీసీ కెమెరా ఫుటేజ్ లను స్వాధీనం చేసుకున్నారు.బ్యాంకు లో ఏమీ నష్టం జరగలేదని నయా పైసా పోలేదని ఖాతాదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని బ్యాంకు మేనేజర్ సంపూర్ణ తెలిపారు.

సిసి పుటేజీల ను పరిశీలించి బ్యాంకు దోపిడీ కి యత్నించిన దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఎస్సై ప్రేమ్ దీఫ్ తెలిపారు.కెడీసీసీ బ్యాంకులో చోరీకి యత్నించిన సమాచారం తెలుసుకున్న నాస్కాభ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జరిగిన సంఘటన గురించి బ్యాంకు మేనేజర్ సంపూర్ణ ను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని అడిగి తెలుసుకున్నారు .బ్యాంకు వద్ద నైట్ వాచ్ మెన్ ను ఏర్పాటు చేయాలని వారు రవీందర్ రావు ను కోరారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube