ఈవిఎంల మొదటి రాండమైజేషన్ పూర్తి

త్వరలో జరిగే శాసన సభ ఎన్నికలకు( Elections ) సంబంధించి మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి అయినదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.శుక్రవారం ఐ డి ఓ సి వీడియో ఎన్ ఐ సి హల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగు రూమ్ నందు ఉనటువంటి కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు , వివి ప్యాట్ల రాండమైజేషన్ మొదటి రాండమైజేషన్ నిర్వహించారు.

 First Randomization Of Evms Completed,evms,first Randomization,elections,rajanna-TeluguStop.com

ప్రక్రియ పూర్తి చేసి స్క్రీన్ ద్వారా చూపించారు.వారి సమక్షంలో మొదటి రాండమైజేషన్ ప్రక్రియ( First randomization ) ప్రక్రియ పూర్తి చేసిన వేములవాడ , సిరిసిల్ల నియోజక వర్గాలకు కేటాయించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్ ల జాబితా రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేశారు.

కేంద్ర ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube