డ్రై లిప్స్..
చాలా మంది చాలా కామన్‌గా ఫేస్ చేసే సమస్యల్లోనూ ఇదీ ఒకటి.లిప్స్ డ్రైగా మారడం వల్ల.
నిర్జీవంగానూ మరియు అందవిహీనంగానూ కనిపిస్తాయి.పైగా డ్రై లిప్స్ ఉండే వారికి పగుళ్ల సమస్య కూడా అధికంగానే ఉంటుంది.
అందుకే పొడి బారిన పెదవులను.మృదువుగా, కొమలంగా మార్చుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు.
మార్కెట్‌లో దొరికే రకరకాల ప్రోడెక్ట్స్‌ను యూజ్ చేస్తుంటారు.అయితే డ్రై లిప్స్‌ను నివారించడంలో గ్లిజరిన్ సమర్ధవంతంగా పని చేస్తుంది.
మరి పెదవులకు గ్లిజరిన్ ఎలా యూజ్ చేయాలో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా పెదవులకు ఉండే లిప్‌స్టిక్‌ను తొలిగించి శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసుకోండి.
ఆ తర్వాత కొద్దిగా గ్లిజరిన్ తీసుకుని పెదవులకు అప్లై చేసి స్మూత్‌గా కాసేపు మసాజ్ చేసుకోండి.ఇలా ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు చేసి.
ఉదయాన్నే కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.తద్వారా గ్లిజరిన్‌లో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు పొడబారిన పెదవులను తేమగా, మృదువుగా మారతాయి.
మరియు పగుళ్ల సమస్య కూడా దరి చేరకుండా ఉంటుంది.
అలాగే ఒక బౌల్ తీసుకుని అందలో ఒక స్పూన్ గ్లిజరిన్, ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లిప్స్‌కు అప్లై చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.అనంతరం వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే పెదవులపై డెడ్ స్కిన్ సెల్స్ పోయి కాంతివంతంగా, అందంగా మారతాయి.డ్రై లిప్స్ సమస్య సైతం ఉండదు.
ఇక ఈ టిప్స్‌తో పాటుగా మరి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.పెదవులకు కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్స్ వాడరాదు.అటువంటి వాటి వల్ల లిప్స్‌పై నూనె గ్రంథులు పోయి.డ్రైగా మారతాయి.
అందుకే పెదవులకు నాణ్యమైన లిప్‌స్టిక్స్‌ను వాడాలి.వాటర్ ఎక్కువగా సేవించాలి.
తాజా పండ్లు, నట్స్ డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.పెదవులపై మృతకణాలను ఎప్పటికప్పుడు తొలిగించుకోవాలి.
తద్వారా డ్రై లిప్స్ తేమగా, కోమలంగా మారతాయి.