ఈవిఎంల మొదటి రాండమైజేషన్ పూర్తి

త్వరలో జరిగే శాసన సభ ఎన్నికలకు( Elections ) సంబంధించి మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి అయినదని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

శుక్రవారం ఐ డి ఓ సి వీడియో ఎన్ ఐ సి హల్ నందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల సమక్షంలో ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగు రూమ్ నందు ఉనటువంటి కంట్రోల్ యూనిట్లు, బ్యాలట్ యూనిట్లు , వివి ప్యాట్ల రాండమైజేషన్ మొదటి రాండమైజేషన్ నిర్వహించారు.

ప్రక్రియ పూర్తి చేసి స్క్రీన్ ద్వారా చూపించారు.వారి సమక్షంలో మొదటి రాండమైజేషన్ ప్రక్రియ( First Randomization ) ప్రక్రియ పూర్తి చేసిన వేములవాడ , సిరిసిల్ల నియోజక వర్గాలకు కేటాయించిన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వివి ప్యాట్ ల జాబితా రాజకీయ పార్టీ ప్రతినిధులకు అందజేశారు.

కేంద్ర ఎన్నికల మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్ కోరారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

‘క’ సినిమాలో చూపించిన ఊరు నిజంగానే ఎక్కడుందంటే?