బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో ఆయన నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ జరుగుతుంది.
అయితే షూటింగ్ సమయంలో షారుక్ ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.ఈ ఘటనలో ఆయన ముక్కుకు గాయమైందని సమాచారం.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉందని, ప్రమాదం తరువాత భారత్ కు తిరిగి వచ్చారని తెలుస్తోంది.అయితే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో జవాన్ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది.