అమెరికాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు రెచ్చిపోయారు.శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై( Indian Consulate ) దాడికి పాల్పడ్డారు.
దానికి నిప్పుపెట్టి.దహనం చేసేందుకు యత్నించారు.
అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు వేగంగా స్పందించి మంటలను అదుపు చేశారు.అయితే నెలల వ్యవధిలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్‌పై దాడి జరగడం కలకలం సృష్టించింది.
ఈ ఘటనను అమెరికా( America ) ఖండించింది.దౌత్యకార్యాలయాలు, దౌత్యవేత్తలపై హింసకు పాల్పడటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిథి మాథ్యూ మిల్లర్( Matthew Miller ) పేర్కొన్నారు.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఖలిస్తాన్ మద్ధతుదారులు( Khalistan Supporters ) విడుదల చేశారు.ఇందులో హింస హింసనే ప్రేరేపిస్తుందని వ్యాఖ్యలు చేసినట్లుగా అంతర్జాతీయ మీడియా తెలిపింది.ఇటీవల కెనడాలో దారుణహత్యకు గురైన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను కూడా దుండగులు గుర్తుచేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు మీడియా పేర్కొంది.ఇతను.
ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ సభ్యులకు శిక్షణ, నిధులు వంటివి అందించేవాడు.నిజ్జర్‌కు సిక్ ఫర్ జస్టిస్ సంస్థతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి.
అలాగే ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆస్ట్రేలియాలో నిర్వహించిన రెఫరెండంలోనూ హర్‌దీప్ హస్తం వుంది.ఇతని తలపై భారీ రివార్డ్ కూడా వుంది.
అలాగే కెనడాకు అప్పగించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారత్ నిజ్జర్ పేరు కూడా చేర్చిన సంగతి తెలిసిందే.

కాగా.ఈ ఏడాది మార్చిలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్( Amritpal Singh ) వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే.ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.
బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగారు.ఈ క్రమంలోనే శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయంపై దాడికి దిగారు ఖలిస్తాన్ మద్ధతుదారులు.
ఈ ఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.భారత్‌కు మిత్రదేశాలైన కెనడా, యూకే, యూఎస్‌లు ఈ తరహా అతివాద భావజాలానికి తావివ్వకూడదని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు.







