సాధారణంగా కొందరికి నైట్ బెడ్ పై పడుకోగానే నిద్ర పట్టేస్తుంటుంది.కానీ కొందరికి మాత్రం అర్ధరాత్రి 12 దాటిన నిద్ర రాదు.
దీన్నేనిద్రలేమి ( insomnia ) అంటారు.చాలా మంది నిద్ర పట్టడం కోసం స్లీపింగ్ పిల్స్ పై ఆధారపడుతుంటారు.
కానీ ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కాదు.వీటిని రెగ్యులర్ గా వాడితే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ డెడ్ వంటి ఎన్నో ప్రమాదకరమైన సమస్యలు తలెత్తే రిస్క్ పెరుగుతుంది.
అందుకే సహజంగానే నిద్రలేమి సమస్యను పరిష్కరించుకోవాలి.అయితే కొన్ని కొన్ని ఆహారాలు అందుకు అద్భుతంగా సహాయపడతాయి.
అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఉదయం నానబెట్టిన బాదం పప్పును తీసుకుంటూ ఉంటారు.అయితే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజు నైట్ నిద్రించడానికి గంట ముందు ఆరు నుంచి ఎనిమిది నానబెట్టిన బాదం పప్పు ( Almonds )ను తీసుకోవాలి.బాదం పప్పులో ఉండే పలు సుగుణాలు నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి.
బాదం పప్పును తీసుకుంటే రాత్రుళ్లు చాలా త్వరగా నిద్ర పడుతుంది.
అలాగే నిద్రలేమి సమస్యను నివారించడానికి అరటి పండు ( Banana ) కూడా ఎంతో బాగా సహాయపడుతుంది.
రోజు నైట్ ఒక అరటి పండును తీసుకుంటే సుఖమైన, ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.నైట్ త్వరగా నిద్ర పట్టడానికి సహాయపడే ఆహారాల్లో చేపలు ఒకటి.
చేపలు నిద్రలేమి సమస్యను నివారించడానికి గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.అయితే నిత్యం చేపలు తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వారానికి రెండుసార్లు చేపలను తీసుకుంటే సరిపోతుంది.
రోజు నైట్ త్వరగా నిద్రలోకి జారుకోవాలని భావించేవారు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి కలిపి తీసుకోవాలి.ఇలా చేస్తే నిద్రలేమి అన్న మాటే అనరు.ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
మంచి నిద్రను ప్రేరేపించడంలో తేనె కూడా చక్కగా పని చేస్తుంది.నైట్ ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకున్న సరే హాయిగా నిద్ర పోతారు.
కాబట్టి ఇకపై స్లీపింగ్ పిల్స్ ను వాడటం మానేసి.ఈ విధంగా ప్రయత్నించండి.