ఆ ట్రోల్స్ గురించి ఘాటుగా రియాక్ట్ అయిన థమన్.. మజ్జిగ స్టాల్ ప్రారంభిస్తానంటూ?

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన థమన్( Tollywood Music Director Thaman ) ఎంతో కష్టపడి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.కొంతమంది థమన్ కాపీ క్యాట్ అని కామెంట్ చేసినా, ఆయన వర్క్ పై నెగిటివ్ కామెంట్లు చేసినా ఆయన మ్యూజిక్, బీజీఎం వల్లే సక్సెస్ సాధించిన సినిమాలు అయితే ఉన్నాయి.

 Star Music Director Thaman Shocking Tweet Goes Viral In Social Media Details Her-TeluguStop.com

అయితే గత రెండు రోజులుగా థమన్ గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.ఆ వార్తలు థమన్ ను కించపరిచే విధంగా ఉండటంతో పాటు థమన్ కెరీర్ ను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి.

గుంటూరు కారం సినిమా( Guntur Karam Movie ) నుంచి థమన్ ను తప్పించారని ఆయన స్థానంలో జీవీ ప్రకాష్ కుమార్ ను తీసుకోనున్నారని థమన్ పనితీరు నచ్చకపోవడంతో మహేష్ ఈ విధంగా చేశారని ఒక వార్త వైరల్ అవుతోంది.మరోవైపు బ్రో మూవీ( Bro Movie )కి థమన్ 3.5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని, ఇతర ఖర్చుల కోసం నిర్మాతకు మరో 60 లక్షల రూపాయల బిల్ పంపించారని అయినప్పటికీ బ్రో సినిమాకు సంబంధించిన ఒక ట్యూన్ ఇంకా ఫైనలైజ్ కాలేదని వినిపిస్తోంది.

థమన్ వర్క్ ఆలస్యం చేయడం వల్ల బ్రో మూవీ షూట్ ఇంకా పూర్తి కాలేదని బోగట్టా.ఈ రెండు వార్తలు తన పరువుకు భంగం కలిగించేలా ఉండటంతో ఈ వార్తల గురించి థమన్ ఒకింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు.నా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్ ను ప్రారంభిస్తానని థమన్ ఆ ట్వీట్( Thaman Tweet ) లో పేర్కొన్నారు.

కడుపుమంట సమస్యతో బాధ పడేవాళ్లు ఈ మజ్జిగ తాగి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.నా సమయాన్ని నేను వృథా చేసుకోవాలని అనుకోవడం లేదని చాలా పని ఉందని గుడ్ నైట్ చెబుతూ థమన్ ఆ ట్వీట్ ను ముగించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube