ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా( East Godavari District )లో వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన రాజకీయ కార్యాచరణలో భాగంగా వివిధ సమూహాలతో భేటీ అవుతున్నారు .కాకినాడలో మేధావులు , ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ,సీనియర్ న్యాయవాదులతో బేటీ అయిన పవన్ రాష్ట్ర పాలన పై కొన్ని కీలక వాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది .
పాలకులు చిత్తశుద్ధిగా లేకపోతే అధికార యంత్రాంగం కూడా సక్రమంగా పనిచేయదని , చిన్న పరిశ్రమలకు ఏళ్ల తరబడి ప్రయత్నించినా అనుమతులు రావడంలేదని, వారు నిరాశ తో ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నారని ఆయన విమర్శించారు.విద్యా వైద్య రంగాలను పూర్తిగా ఈ ప్రభుత్వం చంపేసిందని,ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంగా మారిందని ఆయన తెలిపారు.
ప్రజల సమస్యలపై అసెంబ్లీ లోను పార్లమెంట్లోనూ పోరాడాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ క్యాంటీన్ లో పెట్టే టిఫిన్లు తిని వచ్చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు .

జనసేన( Jana sena ) పరిపాలనలో జవాబుదారితనం ఉంటుందని అన్ని వర్గాలకు సుపరిపాలన అందిస్తామని , దేశానికే మార్గదర్శకంగా ఉండేలా చూస్తానని తనకు అవకాశం అవ్వాలని పవన్ కొరినట్లుగా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలను చూసి మేధావులు విద్యావంతులు ఆసక్తి గలవారు రాజకీయాలకు దూరంగా ఉండిపోతున్నారని కాకినాడ వంటి విద్యావంతులు ఎక్కువగా ఉన్న ప్రాంతం లో కూడా తక్కువ ఓటింగ్ శాతం నమోదు అవ్వడానికి ఇదే కారణం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

మత్స్యకార నేతలతో జరిగిన ముఖాముఖిలో దివిస్ ను బంగాళాఖాతంలో కలిపేస్తానన్న ముఖ్యమంత్రి జగన్ ( YS Jagan Mohan Reddy )దానికి తోడుగా అరబిందో ఫార్మాను తీసుకువచ్చారని, ఈ రెండు పరిశ్రమలతో మత్స్యకారుల భవిష్యత్తు ఆగమ్య గోచరం గా మారిందని ఆయన చెప్పుకొచ్చారు.తాను అభివృద్ధికి వ్యతిరేకం కాదని అయితే ప్రజల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తానని మత్యకారుల సమస్యలపై ప్రధానమంత్రికి నివేదిస్తానని ఆయన హామీ ఇచ్చారు .నేరగాళ్లు రాజ్యం ఏలితే శాంతి పద్ధతులు క్షీణిస్తాయని ఇటీవల పదవ తరగతి పిల్లవాడిని తన అక్కని వేధించినందుకు తిరగబడినందుకుగాను పెట్రోల్ పోసి కాల్చి చంపేశారని సాక్షాత్తు ఎంపీ కుటుంబానికి కూడా రక్షణ లేని రాష్ట్రంలో మనం బతుకుతున్నాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.