దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఒక ప్రత్యేక రికార్డ్ కర్ణాటక రాష్ట్రానికి( Karnataka ) ఉంది .మరి ఈసారైనా కన్నడ ఓటర్లు ఆ రికార్డును బ్రేక్ చేస్తారా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతుంది.ఈ రాష్ట్రంలో గడిచిన 38 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వము కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు అంతేకాకుండా పూర్తిస్థాయి పరిపాలన చేసిన ముఖ్యమంత్రులు కూడా కేవలం ముగ్గురు మాత్రమే అవ్వడం ఇక్కడ కుర్చీలాట ఏ స్థాయిలో మారుతుందో తెలియ చేస్తుంది పూర్తి స్థాయిలో పరిపాలించిన ఆ ముగ్గురు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అవ్వడం విశేషం .
1990 నుంచి మూడు పార్టీలు వరుసగా పోటీ చేస్తుండటం భౌగోళికంగా కర్ణాటకలో మూడు ప్రాంతాలలో ఈ పార్టీలకు బలమైన పట్టు ఉండటంతో ఏ పార్టీకి సింగిల్ మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి, వాటి మనుగడ కష్టమవుతుంది మైసూర్ ప్రాంతంలో జెడిఎస్ కి( JDS ) బలమైన సంస్థాగత నిర్మాణం ఉంది.అక్కడ అధిక సంఖ్యలో ఉన్న ఒక్కలింగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు జెడిఎస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు
ఉత్తర కర్ణాటక మధ్య కర్ణాటకలో బిజెపికి ( BJP ) బలం ఉంది.అక్కడ లింగాయత్ల నేత యడ్యూరప్ప కర్ణాటకాను బిజెపికి బలమైన కేంద్రం గా మార్చారు .కేవలం ఆయన కృషివల్లే బిజెపి కర్ణాటకలో ఎదిగిందని చెప్పవచ్చు.మరొక పక్క కాంగ్రెస్కు( Congress ) రాష్ట్రమంతటా బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ సీట్ల సంఖ్యలో అది ప్రతిపలించడం లేదు .అందువల్ల సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం రకరకాల కారణాలతో అవి పడిపోవడం రివాజుగా మారింది.
అంతే కాకుండా కర్ణాటక ఓటర్లు లో సంతృప్తి తక్కువ అని ఎంత బాగా పరిపాలించినా కూడా రెండోసారి అవకాశం ఇవ్వారనీ వారి డిమాండ్లను తీర్చడం కష్టం అంటూ కూడా విశ్లేషణలు ఉన్నాయి .మరి 38 ఏళ్ల రికార్డును తిరగరాసి భాజపా మరొకసారి కర్ణాటకలో అధికారంలోకి వస్తుందా? లేక పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా? లేదా సర్వే ఫలితాలు నిజమై కాంగ్రెస్ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతుందా? మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.