పెళ్లంటే నూరేళ్లపంట… ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని ఘట్టం.కానీ అదే పెళ్లికి తీరని వేదనను మిగిలేస్తుంది.
అర్థంపర్థం లేని ఈగోలతో పెళ్లి అర్ధాన్ని మార్చేస్తున్నాయి.ఎంతో భవిష్యత్తు ఉండే కొన్ని జంటల్లో దరిచేరలేని అగాధాన్ని సృష్టిస్తున్నాయి.
ఇలాంటి ఒక సంఘటనే సింగర్ కౌసల్య జీవితంలోనూ జరిగింది.
సింగర్ గా కౌసల్య గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఆమె పాడిన పాటలు టాలీవుడ్ లో ఎంతో మంచి విజయాన్ని సాధించాయి.ఆమెకి ఎనలేని గౌరవాన్ని, ప్రతిష్టలను తీసుకొచ్చాయి.
సింగర్ గా కౌసల్య ఎక్కువగా మ్యూజిక్ డైరెక్టర్ చక్రి దగ్గర ఎక్కువగా పాటలు పాడారు.ఆమె సినిమా జీవితం కాసేపు పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో మాత్రం బయట ప్రపంచానికి తెలియని ఎంతో విషాదం దాగి ఉంది.
ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన కౌసల్యకి చేదు అనుభవం మిగిలింది.పెళ్లయిన 16వ రోజే భర్త లాగిపెట్టి కొట్టడంతో ఆమె జీవితంలో పెను తుఫాన్ మొదలయ్యింది.తండ్రి చనిపోవడంతో తల్లి అన్ని తానై పెళ్లి బాధ్యతలు తలపై వేసుకొని కౌసల్య పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది కౌసల్య తల్లి.పెళ్ళిలో మర్యాదలు సరిగా చేయలేదని కౌసల్య అత్తారింటి వారు ఆమెని పోరు పెట్టారు.
పైగా తలపై పెళ్ళిలో పెట్టే జీలకర్ర బెల్లం లో జీలకర్ర తగ్గింది అనే నెపం తో కౌసల్య పై ఆమె భర్త చేయి చేసుకున్నాడు.
అయిన తనకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు కాబట్టి వారి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొనిభర్తతో కొన్నాళ్లపాటు కాపురం చేసింది.వీరి కాపురానికి గుర్తుగా ఒక కుమారుడు కూడా జన్మించాడు.కానీ ఆరేళ్ల నరకం తర్వాత తన భర్తకు మరొక అమ్మాయితో సంబంధం ఉండగా ఆమె గర్భం దాల్చింది అనే విషయం తెలియడంతో ఇక విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దాంతో కౌసల్య భర్త నుంచి విడిపోయి కొడుకుతో ప్రస్తుతం ఒంటరిగానే జీవిస్తోంది.తన కెరియర్ పై దృష్టి పెట్టి సక్సెస్ ఫుల్ గా ముందుకు పోతుంది.