జనరల్ గా ఎవరైనా సరే కంపల్సరీగా పాములను చూస్తే చాలు.భయపడిపోతుంటారని చెప్పొచ్చు.
పామును చూస్తే అంత భయపడే జనాలు ఒకవేళ అనకొండను చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కాగా, ఓ వ్యక్తి మాత్రం భారీ అనకొండను అలా హ్యాపీగా పట్టేసుకున్నాడు.
సరదాగా నీటిలో దాని మానాన అది పోతుండగా, భారీ అనకొండను వెంటపడి మరీ పట్టుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
ఇంతకీ ఆ భారీ అనకొండ అతని చేతికి చిక్కిన తర్వాత ఏం జరిగిందంటే.
మీమ్స్ వాలా న్యూస్ అనే ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ కాబడిన ఈ వీడియోలో భారీ అనకొండ ఉంది.
షిప్ వెళ్తున్న క్రమంలో ఓ వ్యక్తి.నీటిలో దాగి ఉన్న భారీ అనకొండ తోకను పట్టుకున్నాడు.అసలు అతడు దాని తోకను ఎలా గుర్తించాడో తెలియదు.కానీ, తోకను పట్టి షిప్ లోకి గుంజే ప్రయత్నం చేస్తాడు.
దాంతో భారీ సైజులో ఉన్న అనకొండ తన బలాన్నంతా ఉపయోగించి అతని నుంచి తప్పించుకుంది.బలంగా వ్యక్తి పట్టుకున్నట్లు పట్టుకుని ఒకసారి వదలగానే ఆ భారీ అనకొండ నీటిలో వేగంగా వెళ్లిపోయింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు అనకొండతో ఆటలు ప్రమాదకరం, బీ కేర్ ఫుల్ అని కామెంట్స్ చేస్తున్నారు.
అతను చాలా ధైర్యవంతుడని ఈ సందర్భంగా కొందరు పోస్టులు పెడుతున్నారు.కెమెరాకు చిక్కిన అనకొండ అనే క్యాప్షన్ ఈ వీడియోకు పెట్టగా, ఇందులో అతగాడి చేతికి అనకొండ చిక్కినట్లే చిక్కి తప్పించుకుపోయిందని ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు.
అయితే, ఇది పాత వీడియో అని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.