ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కి ఎదురు దెబ్బ తగిలింది.ఈ కామర్స్ వేదికపై ప్రతి వ్యాపారస్తుడికి ఓ వేదిక కల్పించాలని సోల్డ్ బై అమెజాన్ ను.
అమెజాన్ 2018 లో తీసు కొచ్చింది.అయితే, ఈ పథకం దాదాపు 2 సంవత్సరాల పాటు అమలు జరిగింది.
సోల్డ్ బై అమెజాన్ ప్రకారం.చిన్న కొనుగోలు దారులకు సంబంధించిన ఉత్పత్తుల యొక్క ధర.దాన్ని నిర్ణయించే అధికారం అమెజాన్ దగ్గర ఉంది.ఇది సరైనది కాదంటూ.2022 జనవరి 26న పిటిషన్ నమోదు అయ్యింది. థర్డ్ పార్టీ సెల్లర్స్ మధ్య పోటీని నియంత్రిస్తూ సోల్డ్ బై అమెజాన్ బిజినెస్.
అమెజాన్‌కు ఎక్కువ లాభాలు తెస్తోందంటూ.పిటీషన్‌లో పేర్కొన్నారు.
వాషింగ్టన్ అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గుసన్ ఈ పిటిషన్ పై విచారణకు సిద్ధమయ్యారు.
అయితే.
, తమ బిజినెస్ మోడల్‌పై పిటీషన్ నమోదు అయింది.విచారణ ప్రారంభం అవుతుందని తెలిసిన వెంటనే ‘సోల్డ్ బై అమెజాన్‘ కార్యక్రమాన్ని తాము రద్దు చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది.అంతే కాకుండా యాంటీ ట్రస్టు చట్టాలను మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి వాషింగ్ టన్ అటార్నీ జనరల్ కార్యాలయానికి 2.25 మిలియన్ డాలర్లును జమ చేసింది.కోర్టులో వెలువడిన తీర్పులో సంబంధం లేకుండా ఈ రెండు నిర్ణయాలు తీసుకున్నట్టు అమెజాన్ ప్రకటించింది.
ఇప్పటికే సోల్డ్ బై అమెజాన్ పై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి.కాగా, తాజాగా అమెజాన్ ప్లాట్‌ఫారమ్ పై త్రివర్ణ పతాకం ప్రింట్‌తో అనేక ఉత్పత్తులను విక్రయించినందుకు మధ్యప్రదేశ్ లోని భోపాల్ పోలీసులు మంగళవారం సాయంత్రం కంపెనీకి చెందిన పలువురు విక్రేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.అమెజాన్ తన ఉత్పత్తులలో కొన్ని త్రివర్ణ పతాక చిత్రాలను కలిగి ఉండటంతో సోషల్ మీడియాలో వినియోగదారుల ఆగ్రహాన్ని కూడా ఎదుర్కొంది.