అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు మొదటి నుంచి ఇష్టపడని జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.ఆ తరువాత ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించాడు.
ఆ నిర్ణయం రాజకీయ పార్టీల్లోనూ, నాయకుల్లోనూ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.తాజాగా బయటపడిన విషయం ఏంటి అంటే అమరావతిని నమ్ముకుని చిత్ర సీమకు చెందిన హీరోలు, నిర్మాతలు చాలామంది దెబ్బతిన్నారనే సమాచారం ఇప్పుడు బయటకి పొక్కుతోంది.
ఇప్పటివరకు అమరావతికి దూరంగా సిని పరిశ్రమ ఉందనుకున్నా అది నిజం కాదనే విషయం తేలిపోయింది.అమరావతికి సిని పరిశ్రమ రాలేదు గాని వ్యక్తిగతంగా సిని పరిశ్రమ ప్రముఖులు మాత్రం భారీగా భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
జగన్ ప్రకటన తరువాత అమరావతి లో భూములు కొనుగోలు చేసిన కొందరు సిని ప్రముఖులు భయపడుతున్నారు.ఒక స్టార్ హీరో ఏకంగా ఆరు వందల ఎకరాల వరకు కొనుగోలు చేస్తే మరో స్టార్ నిర్మాత అమరావతిలో వ్యాపారం నిమిత్తం 380 ఎకరాలు ఒకేసారి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.
రాజకీయంగా తమకు ఉన్న పరిచయాలతో కొందరు సిని పెద్దలు కూడా అమరావతిలో భారీగానే భూములు కొనుగోలు చేసి జగన్ నిర్ణయంతో లబోదిబోమంటున్నారు.తాము కొన్న తరువాత కోట్ల రూపాయలకు చెరిరిన ఎకరం ఇప్పుడు లక్షల్లోకి పడిపోవడంతో వీరిలో కంగారు మొదలయ్యింది.
ఇప్పుడు ఆ భూమి అమ్ముకుందామన్నా రేటు పడిపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడ పెట్టుబడి పెట్టిన సినీ పెద్దలు ఉన్నారు.