అనుష్క భాగమతి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది.ఆమె చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నా కూడా ఆమె మాత్రం లావు ఎక్కువగా ఉన్న కారణంగా తక్కువ చిత్రాలు చేస్తూ వస్తుంది.
ఎట్టకేలకు లేడీ ఓరియంటెడ్ చిత్రం నిశబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.ఈ అమ్మడు చేస్తున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అవుతున్నాయి.
ఈ సమయంలోనే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకు ప్రభాస్ రాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

త్వరలో జరుగబోతున్న అనుష్క నిశబ్దం సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట.అనుష్కకు ప్రభాస్‌కు మద్య రిలేషన్ ఉందని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది.ఆ విషయాన్ని ఒప్పుకోకున్నా తాము మంచి స్నేహితులం అంటూ మాత్రం వారు పదే పదే ఒప్పుకుంటారు.
అందుకే అనుష్క మరియు ప్రభాస్‌ల కాంబోకు మంచి క్రేజ్ ఉంది.వారిద్దరు ఒకే స్టేజ్‌పై ఉంటే లేదంటే ఒకే ఫ్రేమ్‌లో ఉంటే ఫ్యాన్స్ మరియు పబ్లిక్‌కు పండుగే.

అందుకే నిశబ్దం సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్‌ను వాడేసుకోవాలని నిర్ణయించుకున్నారు.అందుకు సంబంధించిన నిర్మాతలు అనుష్కను ఒప్పించేందుకు చర్చలు జరుపుతున్నారట.నిర్మాతలు కూడా మరో వైపు ప్రభాస్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.జాన్ చిత్రం చివరి దశ చిత్రీకరణ కోసం ప్రభాస్ చాలా బిజీగా ఉన్నాడు.ఎంత బిజీగా ఉన్నా కూడా అనుష్క కోసం ఖచ్చితంగా ప్రభాస్ టైం కేటాయిస్తాడని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.