సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసిన సంచలనమే.ఆయన తెరకెక్కించే సినిమాలు మొదలుకొని, ఆయన చేసే కామెంట్ల వరకు అన్నీ వివాదాస్పదంగా నిలుస్తాయి.
కాగా ఇటీవల అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమాతో ఏపీ పాలిటిక్స్‌లో వేలు పెట్టిన వర్మ, తాజాగా బ్యూటీఫుల్ అనే సినిమాకు కథను అందించాడు.ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండగా, చిత్ర ప్రమోషన్స్‌లో వర్మ చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు.
ఇంతకీ వర్మ ఏం చేశాడని మీరు అనుకుంటున్నారా? జనవరి 1న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో బ్యూటీఫుల్ చిత్ర యూనిట్‌తో కలిసి వర్మ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిత్రంలో నటించి హీరోయిన్ నైనా గంగూలీతో కలిసి వర్మ చిందులు వేశాడు.
వర్మ డ్యాన్సు వేస్తుండటంతో అక్కడున్న జనం ఈలలు వేసి వర్మను మరింత రెచ్చగొట్టారు.ఈ క్రమంలో వర్మ నైనా గంగూలీ కాళ్లపై పడిపోయాడు.దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు.
వర్మ అలా చేయడంతో నైనా గంగూలీ ఆయనను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది.ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడున్న మీడియా జనాలకు బోలెడంత స్టఫ్ దొరికినంత పనైంది.వర్మకు వోడ్కా ఎక్కువైందని, అందుకే అమ్మడి కాళ్లపై పడ్డాడంటూ సోషల్ మీడియాలో కోడై కూస్తున్నారు.
ఇక బ్యూటీఫుల్ చిత్రానికి వర్మ కథ అందించగా అగస్త్య మంజు డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమాలో నైనా గంగూలీ, సూరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఎ ట్రిబ్యూట్ టు రంగీలా అనే క్యాప్షన్‌తో ఈ సినిమాను వర్మ రిలీజ్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలంటే జనవరి 1 వరకు ఆగాల్సిందే.