ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ వైసీపీ ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగానే పరిగణించబడతారు అంటూ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ లో సమూల మార్పులు, సంస్కరణ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.దీనిలో భాగంగానే ఆర్టీసీకి నూతన నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత ఏపీఐఐసీ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ను నూతన ప్రభుత్వం నియమించింది.ఈయన స్థానంలో ప్రస్తుత పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి గా పనిచేస్తున్నరజత్ భార్గవ్ ను ఏపీఐఐసీ వైస్ చైర్మన్ గా, ఎండీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది