ఇంత పోటీలో మహేష్‌ ఇలా చేస్తే నిర్మాతకు దిక్కు ఎవరు?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుంది.ఇటీవలే మహేష్‌బాబు తన పోర్షన్‌కు డబ్బింగ్‌ కూడా చెప్పాడు.

 Mahesh Babu Not Attend The Sari Leru Nikkevvaru Movie Promotions-TeluguStop.com

సినిమా పనిని పూర్తి చేసి మహేష్‌బాబు ముంబయి వెళ్లాడు.అక్కడే వారం రోజుల వరకు ఉంటాడని సమాచారం అందుతోంది.

మళ్లీ సినిమా రెండు మూడు రోజులు ఉండగా వస్తాడని టాక్‌ వినిపిస్తుంది.అయితే ఈ విషయమై మహేష్‌బాబుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

నిర్మాత పరిస్థితి అర్థం చేసుకోకుండా మహేష్‌బాబు ఇలా చేయడం ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.

Telugu Mahesh Babu, Maheshbabu-

మహేష్‌బాబు సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు విడుదల కాబోతుంది.అదే సమయంలో అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో సినిమా విడుదల కాబోతుంది.అలాంటి సమయంలో సినిమా కోసం చాలా ప్రమోషన్స్‌ చేయాల్సి ఉంటుంది.

కాని మహేష్‌బాబు మాత్రం ప్రమోషన్‌ విషయాలు పట్టించుకోకుండా ముంబయి చెక్కేశాడు.దగ్గర ఉండి ప్రమోషన్‌ కార్యక్రమాలు మరియు ఇతర విషయాలను చూసుకుంటే బాగుంటుంది కదా అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Mahesh Babu, Maheshbabu-

సరిలేరు నీకెవ్వరు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.మహేష్‌బాబు ఇంకా పెంచాల్సింది ఏముందని కొందరు అనుకుంటూ ఉండవచ్చు.కాని ప్రస్తుత రోజుల్లో ఒక సినిమాను ప్రేక్షకులకు రీచ్‌ చేయడం అనేది సినిమా తీసినదాని కంటే చాలా పెద్ద కష్టమైన విషయం.అందుకే ఈ సినిమా ప్రమోషన్‌లో మహేష్‌బాబు యాక్టివ్‌గా పాల్గొంటే నిర్మాతకు కాస్త సేఫ్‌ అంటున్నారు.

మహేష్‌బాబు పోయి ముంబయిలో ఉంటే మరి సినిమాకు దిక్కు ఎవరు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube