ఎడిటోరియల్ : గ్రేటర్ లో తప్పెవరిది ? ఓటర్లదా రాజకీయ పార్టీలదా ?

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అన్ని రాజకీయ పార్టీలకు ట్విస్ట్ ఇస్తున్నాయి.ఎప్పుడూ లేని విధంగా గ్రేటర్ ఎన్నికలలో ప్రచారం గట్టిగానే అన్ని పార్టీలు నిర్వహించాయి.

 Decreasing Voting Percentage In Ghmc Elections Is The Fault Of The Political Par-TeluguStop.com

జాతీయ స్థాయి నాయకులు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గ్రేటర్ లో అవి వేడి పెంచాయి.ఎన్నో రకాల హామీలను నాయకులు ఇచ్చారు.

ఒక కార్పొరేషన్ ఎన్నికల స్థాయి కంటే  ఎన్నో రెట్లు ఎక్కువగా ఊహించుకొని మరి ఇక్కడ ప్రచారం నిర్వహించారు.ఇక కాంగ్రెస్, టిడిపి, ఎంఐఎం పార్టీలు ప్రచారం గట్టిగానే చేసినా, టిఆర్ఎస్ , బిజెపి లు మాత్రం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని , చావో రేవో అన్నట్టు గా ప్రచారం నిర్వహించాయి.

అయినా గ్రేటర్ ఓటర్లలో కదలిక కనిపించలేదు.ఓటింగ్ శాతం గతంతో పోలిస్తే మరింత తక్కువగా నమోదు కావడం అన్ని పార్టీలకు ఆందోళన కలిగించాయి.

జనాలు పెద్దగా పోలింగ్ కేంద్రాలకు రాకపోవడంతో నిన్నటి నుంచే అన్ని పార్టీలు టెన్షన్ గా ఎదురు చూశాయి.నిన్న మధ్యాహ్నం నుంచే అన్ని పార్టీలు టెన్షన్ పడ్డాయి.

ఓటర్లు పెద్దగా ఓటింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించకపోవడం తో,  సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.హైదరాబాద్ వారు బద్ధకస్తులు అని , ఓటు వేయమని అడిగితే తిని పడుకుంటున్నారు అని, వాళ్లకు ప్రభుత్వ పథకాలు ఇవ్వకూడదని, వారికి ప్రశ్నించే హక్కు లేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్దపెద్ద కామెంట్స్ పెడుతున్నారు.

దీనికి ప్రధాన కారణం గ్రేటర్ పరిధిలో తక్కువ పోలింగ్ నమోదు కావడమే.అయితే గ్రేటర్ ఓటర్లు ఓటింగ్ కు రాక పోవడం తప్పే అయినా, ఇందులో రాజకీయ పార్టీల పాత్ర ఎంత ? ఇందులో ఎన్నికల సంఘం పాత్ర ఎంత అనే విషయం చర్చకు వస్తోంది.

Telugu Bandi Sanjay, Congress, Ghmc, Revanth-Political

వాస్తవంగా బిజెపి, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది  ఇప్పుడు గ్రేటర్ లో సత్తా చాటడం ద్వారా , రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవచ్చు అనే అభిప్రాయంతో కనిపించింది.ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి ఆ పార్టీలోని నాయకులు ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో సహా గ్రేటర్ లో అడుగుపెట్టారు.ఇక టిఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ , కేటీఆర్ వంటివారు గట్టిగానే కష్టపడ్డారు.టిడిపి తరఫున నాయకులెవరూ ప్రచారం చేయకపోయినా అభ్యర్థులే ప్రచారం చేస్తున్నారు .ఇక కాంగ్రెస్ తరఫున రేవంత్ ఒక్కరే గట్టిగా పోరాటం చేసినట్టుగా కనిపించారు .ఇదే సమయంలో మతపరమైన రాజకీయ విమర్శలు పెరిగిపోవడం, టిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీ ల మధ్య మత జాతి విద్వేషాల పై ఎక్కువగా విమర్శలు చేసుకోవడం వంటి వ్యవహారాలతో నిజంగానే ఓటర్లు వెనక్కి తగ్గినట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏ పార్టీకి ఓటు వేసినా, పెద్దగా ప్రయోజనం ఏముంది అన్నట్లుగా చాలామంది సైలెంట్ అయ్యారని, రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సరైన విధంగా స్పందించలేదని,  వరుస సెలవులు వచ్చిన సమయంలో పోలింగ్ పెట్టడం,  ఓటర్ లిస్ట్ సరిగా తయారు చేయకుండానే అసెంబ్లీకి వాడిన ఓటర్ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించడం,  కరోనా ప్రభావంతో ఇప్పటికే నగరాన్ని విడిచి చాలామంది తమ స్వగ్రామాలకు వెళ్లిపోవడం , వర్క్ ఫ్రమ్ హోమ్ తో వెసులుబాటు ఉండడం వంటి ఎన్నో కారణాలతో ఓటింగ్ శాతం తగ్గినట్టుగా కనిపిస్తోంది.ఈ వ్యవహారంలో ఓటర్లు కంటే రాజకీయ పార్టీలు , ఎన్నికల సంఘం వ్యవహార శైలి కారణంగానే గ్రేటర్ లో ఓటింగ్ శాతం తగ్గినట్లు గాను విశ్లేషణం మొదలయ్యాయి.

కులమతాలకు అతీతంగా ప్రజలకు మంచి చేయడమే తమ ముఖ్య ఉద్దేశమనే విషయాన్ని అన్ని పార్టీలు భరోసా కల్పించలేకపోవడంతో పాటు, అనవసర భయాలను రేకెత్తించడం వంటి ఎన్నో వ్యవహారాలు గ్రేటర్ లో ఓటింగ్ తగ్గేందుకు దోహదం చేసినట్లుగా కనిపిస్తోంది.అలాగే పోలింగ్ కు ముందు  అక్కడక్కడా అల్లర్లు జరగటం, పార్టీల మధ్య కొట్లాటలు వంటి వ్యవహారాలు, ఓటు వేసేందుకు వెళ్ళినా తిరిగి సేఫ్ గా వస్తామో రామో అనే భయం, ఇలా ఎన్నో కారణాలు గ్రేటర్ లో ఓటర్లను గడప దాటకుండా చేసినట్లుగా కనిపిస్తోంది.

ఈ వ్యవహారంలో పూర్తిగా ఓటర్లను తప్పు పట్టే కంటే, అందుకు దారితీసిన పరిస్థితులపైన చర్చించుకోవడం అవసరం అనే విషయాన్ని గ్రేటర్ ఎన్నికలు రుజువు చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube