మోడలింగ్ లో సినిమాల్లో చాలామంది అందగత్తెలను మనం చూస్తూ ఉంటాం.కానీ నిజ జీవితంలో అందంగా ఉండే వాళ్ళు చాలా తక్కువమంది కనిపిస్తారు సినిమాల్లో అయితే దేవకన్యలా ఉండే హీరోయిన్స్ ని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో శ్రీదేవి గారిని చూస్తే ఒక దేవకన్య ని చూసిన ఫీల్ కలుగుతుంది.
శ్రీదేవి తర్వాత మిస్ ఇండియా అయినా ఐశ్వర్య రాయనీ చూస్తే కూడా అందంతో తో మాయ చేయగల అమ్మాయి అని అర్థమైపోతుంది.కానీ నిజ జీవితంలో కూడా వాళ్ల అందంతో మంత్రముగ్ధులను చేయగల అమ్మాయిలు ఉన్నారు అంటే మీరు నమ్ముతారా కచ్చితంగా నమ్మి తీరాలి.
ఎందుకంటే మహారాణి గాయత్రి దేవి అనే ఆవిడ అందానికి పెట్టింది పేరు.గాయత్రి దేవి 1919 మే 23న కూచ్ బీహార్ లో జన్మించారు.
అప్పట్లో మహారాణి గాయత్రి దేవి ఫోటోని వాళ్ల మ్యాగజైన్లో కవర్ ఫోటోగా వేసుకోవడానికి చాలా మంది పోటీ పడే వారు.ప్రముఖ ఓబు మ్యాగజైన్ ఆమెనీ దేశంలోనే అతిలోక సుందరిగా కీర్తించింది.అప్పుడు ఉన్న రోజుల్లో ఆమె ఏ డ్రెస్ ధరించిన అది ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచేది.21 ఏళ్ల కి ఆమె జైపూర్ మహారాజు మాన్ సింగ్ నీ పెళ్లి చేసుకున్నారు మాన్ సింగ్ గాయత్రి దేవి ఇద్దరు కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారు.మాన్ సింగ్ కి గాయత్రి దేవి మూడో భార్య గా వెళ్లారు.మాన్ సింగ్ మరణించిన తర్వాత జైపూర్ రాజ్యం సమైక్య భారతదేశంలో విలీనం చేయబడింది మహారాజు మరణించాక ఆమె సవతి కుమారుడు 1970లో సింహాసనాన్ని అధిష్టించాడు ఆమె జైపూర్ రాజ్యానికి రాజమాతగా గాయత్రి దేవి గౌరవ పదవిలో కొనసాగింది.
గాయత్రీ దేవి రాజ వంశీ రాజ్యానికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించింది.ఆమె తండ్రి మహారాజ జితేంద్ర నారాయణ ఆమె తల్లి మరాట రాకుమారి ఇంద్ర రాజే ఆమె మహారాజా మూడవ సాయిజి రావు గైక్వాడ్ ఏకైక కుమార్తె ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజవంశ పాలన రద్దు చేయబడింది.తర్వాత ఆమె విజయవంతమైన నాయకురాలిగా కూడా రాణించింది గాయత్రి దేవి అద్భుతమైన సామర్ధ్యమున్న పోలో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలుపొందారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అయిన బిగ్ బీ అమితాబచ్చన్ కూడా గాయత్రి దేవి లాంటి అందమైన అమ్మాయి ఈ భూమ్మీద ఎక్కడ లేదు అని చెప్పారు ఆమె అందం ముందు చందమామ కూడా చిన్న పోవాల్సిందే అని కూడా కితాబిచ్చారు.
రాజ వంశానికి చెందిన అమ్మాయిలను మనం సినిమాలో చూడడమే తప్ప బయట ఎక్కడా చూడలేదు బాహుబలి సినిమాలో శివగామి, దేవసేన లాంటి రాజవంశస్థులను చూసి రాజుల వంశానికి చెందిన ఆడవాళ్ళు ఇలాగే అందంగా ధైర్యంగా ఉంటారని అని అనుకున్నం కానీ ఆ సినిమాలో ఉన్న పాత్రకు ఏమాత్రం తగ్గకుండా నిజజీవితంలో కూడా మహారాణి గాయత్రి దేవి లాంటి రాజ వంశస్థులు నిజంగానే ఉన్నారు అంటే అది మనం హర్షించదగ్గ విషయం.ఏది ఏమైనా ఇలాంటి రాజవంశస్థుల ను మనం ఇండియాలోనే చూడగలం ఎందుకంటే ప్రపంచ దేశాలలో ఏ దేశంలో కూడా మనం చూడనంత గా భారతదేశంలో స్త్రీలను ఎక్కువ గౌరవిస్తారు.భారతదేశంలో ఉన్న రాణులు చాలా మంది చాలా రాజ్యాలను పరిపాలించారు.
భారతదేశపు స్త్రీలలో ఆత్మ గుణం, నైపుణ్యం, తెగించే తత్వం అందరినీ కాపాడుకునే నైజం ఆడవాళ్లను అందులో భారతదేశపు స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది.అందుకే రాజు లేని ఈ సమయంలో కూడా వాళ్ల రాజ్యాలను కాపాడుకుంటూ వచ్చిన చాలామంది ఉన్నారు.
వాళ్ళల్లో రుద్రమదేవి పేరు కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.ఓరుగల్లు బిడ్డ రాణి రుద్రమదేవి… అయితే మహారాణి గాయత్రి దేవి అనారోగ్యం కారణం వల్ల 2009 జూలై లో ఆమె జైపూర్ లో కన్నుమూశారు.
ఆమె చనిపోయే అప్పటికీ ఆయన వయస్సు 90 సంవత్సరాలు.అందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన మహారాణి గాయత్రి దేవి చరిత్ర ఇది…
.