ఫిబ్రవరి 7వ తారీకు నుంచి 14 వ తారీకు వరకు జరిగేటటువంటి ప్రేమికుల దినోత్సవ రోజులలో ప్రతి రోజుకి ఒక్కో ప్రాధాన్యత ఉంది.అయితే ఇందులో ఫిబ్రవరి 13వ తారీఖున కిస్ డే కావడంతో కొందరు ప్రేమికులు ముద్దు ఎలా పెట్టుకోవాలనే విషయంపై అంతర్జాలంలోతెగ వెతుకుతున్నారు.
అలాంటి వారి కోసం ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము.
మానవ జీవితంలో ముద్దు అనేది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది.
అయితే ఇందులో కొందరు కామంతో ముద్దు పెట్టుకుంటే మరి కొందరు ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు. మరికొందరు తమ పై ఉన్నటువంటి నమ్మకం విశ్వాసాన్ని తెలియజేయడానికి కూడా ముద్దు పెట్టుకుంటారు.
తమ గాఢమైన ప్రేమను తెలియజేయడానికి కొందరు ప్రేమికులు “అధర చుంబనం” అంటే పెదవులను పెదవులతో ముడిపెడుతూ ముద్దు పెట్టుకుంటారు.అయితే ఇంతకు ముందే ప్రేమలో ఉన్న వారు తమ ప్రేమ యొక్క గాఢత మరియు విశ్వాసాన్ని తెలియజేయడం కోసం “నుదుటిపై ముద్దు” పెట్టుకుంటారు.
అయితే ఇలా తల్లిదండ్రులు తమ కూతురికి లేదా కొడుకుకి కూడా ముద్దు పెట్టుకుంటారు.మరి కొందరైతే తమ పై ఉన్నటువంటి ఇష్టాన్ని తెలియజేయడం కోసం “బుగ్గలపై ముద్దు” పెట్టుకుంటారు.
అయితే ఇలాంటి బుద్ధులు ఇద్దరు స్నేహితుల మధ్య అలాగే అక్క చెల్లెలు, అన్నదమ్ముల మధ్య కూడా ఉంటాయి.
అయితే సైకాలజీ ప్రకారం తన ప్రియురాలు లేదా భార్య కి మొదటి సారి ముద్దు పెట్టుకునేటప్పుడు ఆడవాళ్ళకి తలవెంట్రుకలను పక్కకి నెడుతూ మెడ ఒంపుపై ముద్దు పెట్టుకుంటే ఆ ముద్దు జీవితాంతం వారికి గుర్తు ఉంటుందని సైకాలజీ లో చెప్పబడింది.
కాబట్టి తమ ప్రియురాలికి లేదా వారికి జీవితాంతం మరచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.