తులసి ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.తులసిని మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్నారు.
తులసి ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.ప్రతి రోజు ఉదయం ఒక కప్పు తులసి టీ త్రాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే తులసితో టీ ఎలా తయారుచేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు తులసి టీ ఎలా తయారుచేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
తులసి ఆకులు కొన్నిఅల్లం చిన్న ముక్కవాము పావు టీ స్పూన్జీలకర్ర పావు టీ స్పూన్మిరియాలు పావు టీ స్పూన్బెల్లం తగినంత
తయారి విధానంఒక గిన్నెలో నీటిని పోసి పైన చెప్పిన పదార్ధాలన్నీ వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.బాగా మరిగిన తర్వాత వడకట్టి వేడిగా ఉన్నప్పుడే త్రాగాలి.ప్రతి రోజు త్రాగటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది.జలుబు, జ్వరం, దగ్గు వంటి వాటికీ మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
రక్తంలో చక్కర స్థాయిలను స్థిరీకరణ చేస్తుంది.దాంతో మధుమేహాం అదుపులో ఉంటుంది.
తులసి టీలో ఉండే పొటాషియం మెదడులో సెరోటినిన్ లెవల్స్ ను పెంచటం వలన డిప్రెషన్,.ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.అంతేకాక రక్త సరఫరా మెరుగు పడుతుంది.
బీపీ కంట్రోల్ అవుతుంది.గుండె సమస్యలు రావు.