‘పెళ్లి చూపులు’ చిత్రంతో ఒక క్లాసీ సక్సెస్‌ను దక్కించుకున్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యాడు.రికార్డు స్థాయిలో అర్జున్ రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ఇదే సమయంలో అర్జున్ రెడ్డిలో ఈయన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిన ఆనందంలో మునిగి పోయాడు.
చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ బెస్ట్ హీరో నామినేషన్స్‌లో ఉన్నప్పటికి కూడా విజయ్ దేవరకొండ వారిని పక్కకు నెట్టి అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఏ హీరోకు అయినా కూడా అవార్డు రావడం జీవితంలోనే సంతోషకర విషయం.విజయ్ దేవరకొండ కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడంతో జీవితంలోనే సంతోషకర క్షణాలను అనుభవించాడు, అనుభవిస్తూనే ఉన్నాడు.విజయ్‌కు దక్కిన అవార్డుల్లో ఇదే ప్రముఖమైన అవార్డుగా చెప్పుకోవచ్చు.
తన మొదటి అవార్డును ఏ హీరో అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు.కాని విజయ్ దేవరకొండ మాత్రం తన అవార్డును వేలం వేసేందుకు సిద్దం అయినట్లుగా ప్రకటించాడు.
డబ్బుల కోసం తాను అర్జున్ రెడ్డి ద్వారా దక్కించుకున్న ఫిల్మ్ ఫేర్ అవార్డును వేలం వేయబోతున్నట్లుగా ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.
విజయ్ దేవరకొండ తాజాగా ట్విట్టర్‌లో తన అవార్డును వేలం వేయబోతున్నట్లుగా ప్రకటించడంతో పాటు, ఆ వచ్చిన మొత్తంతో తాను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద వారికి సాయం చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ప్రతి రోజు ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సాయం చేయడంను గమనిస్తున్నాను.ఆ సాయంలో తాను కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే అవార్డును వేలం వేసి, వచ్చిన మొత్తంను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తాను అంటూ ప్రకటించాడు.
విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయంపై అంతా కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.నిజమైన హీరో అంటూ సినీ వర్గాల వారు కూడా కితాబిస్తున్నారు.
Eppayum pola – Tamil natoda rowdies – Romba ❤ from me 🙂 Gold Medals 2018, Chennai
— Vijay Deverakonda (@TheDeverakonda)
విజయ్ తీసుకున్న నిర్ణయంను మంత్రి కేటీఆర్ కూడా అభినందించాడు.పుట్టి పెరిగిన రాష్ట్రం కోసం విజయ్ మంచి చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం అంటూ కేటీఆర్ ప్రశంసించాడు.
ఇక విజయ్ దేవరకొండ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా సంతోషంను వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.అవార్డును దక్కించుకుని ఉత్తమ హీరో అనిపించుకున్న విజయ్ దేవరకొండ, అవార్డును అమ్మేందుకు సిద్దం అయ్యి, నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు.