ఫోన్ కొట్టు .గిఫ్ట్ పట్టు అనే తరహా కార్యక్రమాలను టీవీల్లో తరుచుగా చూస్తూ ఉంటాము.
ఇప్పుడు అదే తరహాలో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఓ సరికొత్త ఆలోచనకు తెరతీసింది.సోషల్ మీడియా కి ఉన్న పవర్ ఏంటో కనిపెట్టిన ఆ పార్టీ.
సోషల్ మీడియాలో బాగా బలం పెంచుకోవాలని చూస్తోంది.గతంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ పార్టీలు అధికారం దక్కించుకోవడానికి కారణం కూడా అదేనని ఒక ఆలోచనకు వచ్చింది.

సుమారు వంద కోట్ల పెట్టుబడితో వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రోగ్రామ్ ని తెదేపా సోషల్ మీడియా టీమ్ సాక్ష్యాలతో బయటపెట్టింది.ఈ ప్రోగ్రామ్ లో భాగం అయ్యే వారికి ” వైసిపి సోషల్ మీడియా టీంలో జాయిన్ అయితే వంద రూపాయలు జాయినింగ్ బోనస్.అంతేకాదండోయ్ నెలాఖరున వాళ్ళు ఎన్ని లైకులు, కామెంట్లు, షేర్లు చేస్తే దానికి అన్ని రూపాయలు వాళ్ల పేటీఎం అకౌంట్ లో జమ చేస్తారంట.ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త ప్లాన్ అట.ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వైసీపీ అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు అనేది అర్ధం అవుతోంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే… ఆ పార్టీకి సోషల్ మీడియాలో ఉన్న మద్దతు వేరే ఈ పార్టీకి లేదు.
ఈ విభాగంలో ఎక్కువమంది వాలంటీర్ గా చేసేవారే ఉన్నారు.గతం ఎన్నికలకు ముందు … చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏమి చేశారు అనేది ప్రజల్లోకి బలం గా తీసుకుని వెళ్లారు.
అయితే ఇక్కడ కీలక అంశం వాలంటీర్ కాంపెయిన్ గా నడించింది.ఎవరికీ వారు చంద్రబాబు కొత్త రాష్ట్రానికి ముఖ్య మంత్రి కావటం దేనికో గుర్తించి దానికి అనుగుణంగా ప్రచారం చేశారు.
ఇప్పుడు కూడా టీడీపీ సొసైల్ మీడియాలో బలం పెంచుకునేందుకు భారీగానే ఖర్చుపెడుతోంది.సుమారు 600 మంది సోషల్ మీడియా టీమ్ తో ప్రత్యర్థి పార్టీలను చిత్తూ చేసేవిధంగా ప్లాన్ వేసుకుని అమలు చేస్తోంది.
దీనికోసం భారీగానే సొమ్ములు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.