Watermelon Juice : ఎండాకాలంలో చల్లని మసాలా.. పుచ్చకాయ జ్యూస్ ఇలా చేసి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

మామూలుగా పుచ్చకాయలు ( Watermelons )వేసవి కాలంలోనే మార్కెట్లో లభిస్తాయి.వేసవిలో ప్రజలు ఇష్టపడే పండ్లలో పుచ్చకాయ ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.

 There Are Many Health Benefits If You Drink Cold Masala Watermelon Juice Like T-TeluguStop.com

పుచ్చకాయ రసం తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది.ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిది.

మండే వేసవి వేడి మనల్ని అలిసిపోయి, నిర్జలీకరణం చేస్తుంది.కాబట్టి ఈ రుచికరమైన పుచ్చకాయ రసం తాగడం ఎంతో మంచిది.

చాలా మంది పండ్ల రసాలను అల్పాహారంగా కూడా తీసుకుంటూ ఉంటారు.మీరు ఫ్రూట్ జ్యూస్ ను ఎక్కువగా ఇష్టపడితే భారతీయుల స్టైల్ లో ఇలా తయారు చేసుకోండి.

మసాలా పుచ్చకాయ రసంలో( masala watermelon juice ) జీలకర్ర పొడి, చాట్ మసాలా మొదలైన మసాలాలు ఉన్నాయి.

Telugu Chat Masala, Cumin Powder, Benefits, Honey, Lemon, Watermelon-Telugu Heal

ఇవి మీ పుచ్చకాయ రసాన్ని మరింత రుచికరంగా చేస్తాయి.నిమ్మకాయ ఆధారిత పానీయం డిఫరెంట్ టేస్ట్ గా మరియు కొద్దిగా తీపి రుచినీ కలిగి ఉంటుంది.ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది.

ఇది జీర్ణ క్రియ కు ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ జ్యూస్ ను తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగా పుచ్చకాయ ఒక కప్పు, జీలకర్ర పొడి ఒక స్పూన్, కారం పొడి సరిపోయినంత, చాట్ మసాలా కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత, నీరు కావలసినంత, నిమ్మ రసం కొద్దిగా ఉంటే సరిపోతుంది.

పుచ్చకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Chat Masala, Cumin Powder, Benefits, Honey, Lemon, Watermelon-Telugu Heal

చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.ఇప్పుడు నిమ్మరసం, తేనే,( Lemon juice, honey ) చిటికెడు ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలపాలి.

తర్వాత ఒక గ్లాసులో ఐస్ క్యూబ్స్ వేసి ఆ తర్వాత ఈ సోర్బెట్ ను కలపాలి.తాజా పుదీనా ఆకులతో అలంకరించి చల్లని జ్యూస్ ను సర్వ్ చేయాలి.

ఈ పానీయం లో జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు ఉండడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.అలాగే ఈ జ్యూస్ లో విటమిన్ సి, ఏ మరియు బి6 ఎక్కువగా ఉంటాయి.

ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube