మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుందని పెద్దలు అంటారు.అమ్మానాన్న మాటలు మంచి చెప్తాయి.
దాంతో వారి మాటలు పిల్లలకు చేదుగా అనిపిస్తాయి.అదే పక్కవారు, స్నేహితులు ఎప్పుడు కూడా సరదా ముచ్చట్లు చెప్పడంతో పాటు కష్టపడాల్సిన అవసరం ఏంటీ, ఎంజాయ్ చేద్దాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు.
అలాంటప్పుడు తల్లిదండ్రులు చెడ్డవారిగా పిల్లలు భావిస్తారు.స్నేహితులను ఉత్తములుగా భావిస్తారు.
మంచి జరగాలని చెప్పే వారు ఎవరైనా కూడా కాస్త కఠినంగా మాట్లాడతారు.చేదుగా ఉన్న వాటిలో మంచి ఉంటుందనే విషయం కాకరకాయను చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు.
ఎంతో మంది చేదుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అసలు కాకరకాయను ముట్టుకునేందుకు కూడా ఆసక్తి చూపించరు.అలాంటి కాకరకాయలో ఎంతటి ఔషదగుణాలు ఉన్నాయో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.కమ్మనైన కాకర కాదు, కఠినమైన కాకర.ఔషద గుణం మహా ఎక్కువ నములు కరకర.
అవును చేదు ఉన్నా కూడా ఔషద గుణం ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని పచ్చిగా నమిలినా కూడా మహా ప్రయోజనం.ముఖ్యంగా షుగర్ వ్యాదితో పాటు కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారు కూడా దీన్ని వాడటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.
ఇప్పుడు కాకరతో కలిగే ప్రయోజనాలు చూద్దాం.
కాకరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, మనిషికి ఎనర్జి ఇవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
కాకర రసం తాగడం వల్ల జలుబు, దగ్గు, ఆస్తమ, గొంతు సమస్యలు తగ్గి పోతాయి.కాకర రసంను చర్మంపై పూసుకోవడం వల్ల మచ్చలు ఉంటే పోవడంతో పాటు, చర్మ సమస్యలు కూడా తొలగి పోతాయి.
షుగర్ మరియు బీపీని కంట్రోల్లో ఉంచడంలో కాకర చాలా బాగా పని చేస్తుంది.బరువు తగ్గడంలో కూడా కాకర చాలా బాగా ఉపయోగపడుతుంది.
వర్కౌట్స్ చేసిన వారు కాకర తింటే మహా ప్రయోజనం.కాకరకాయ కూర ఇష్టంగా తినే వారు మరే కూరను అయినా ఇష్టంగా తింటారు.
అందుకే పిల్లలకు కాకరకాయ తినిపించడం మంచిది.